ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!

`అమ్మ` అని పిలిపించుకోవాల‌ని పెళ్లైన ప్ర‌తి మ‌హిళ కోరుకుంటుంది.అందుకే పెళ్లి త‌ర్వాత ఎప్పుడెప్పుడు ప్రెగ్నెన్సీ వ‌స్తుందా అని ఆశ ప‌డుతుంది.

 Best Food For Pregnancy Women-TeluguStop.com

ఆరాట‌ప‌డుతుంది.ఇక గ‌ర్భం దాల్చాక అప్పుడు ఆ మ‌హిళ ప‌డే ఆనందం అంతా ఇంతా కాదు.

ప్రెగ్నెన్సీ రాగానే తన గురించి కంటే తన కడుపులోని బిడ్డ గురించే ఎక్కువ‌గా ఆలోచిస్తుంటారు.అయితే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఆహార విషయంలో చాలా జాగ్ర‌త్త పాటించాల్సి ఉంటుంది.

 Best Food For Pregnancy Women-ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే కొన్ని ఆహారాల‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాల్సి ఉంటుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

న‌ట్స్ అంటే బాదం, జీడిపప్పు, పిస్తా ప‌ప్పు, వాల్ న‌ట్స్ వంటి ప్ర‌తి రోజు తీసుకోవాలి.ఎందుకంటే, నట్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి శిశువులో కండరాలు ఏర్పడటానికి మ‌రియు ఎదుగుద‌ల‌కు సాహాయ‌ప‌డతాయి.ఐర‌న్ కూడా న‌ట్స్ స‌మృద్ధిగా ఉంటుంది.

ఇది ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో వ‌చ్చే ర‌క్త హీన‌త నుంచి ర‌క్షిస్తుంది.అలాగే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో బీట్రూట్ లేదా బీట్రూట్ జ్యూస్‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాలి.

బీట్రూట్‌లో ఉండే పోష‌కాలు ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంతో పాటు శిశువు ఆరోగ్యంగా పెరిగేందుకు ఉప‌యోగ‌డ‌తాయి. ఖర్జూరంను కూడా గ‌ర్భ‌వ‌తులు రెగ్యుల‌ర్‌గా తీసుకోవాలి.ఖ‌ర్జూరంలో ఉండే విట‌మిన్ కె శిశివు ఎముకల బలానికి సహకరిస్తుంది.మ‌రియు ఖ‌ర్జూరంలో ఉండే ఐర‌న్ క‌డుపులోని శిశువులోని అనీమియా నిరోధించి, ఇమ్యునిటీ పెంచడానికి ఉప‌యోగ‌పడుతుంది.

ఇక పండ్ల విష‌యానికి వ‌స్తే.అర‌టి పండు, దానిమ్మ‌, ఆరెంజ్‌, యాపిల్‌, కివి వంటి పండ్లు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో త‌ప్ప‌కుండా తీసుకోవాలి.అలాగే వారానికి క‌నీసం ఒక‌సారి అయినా ఫిష్ తినాల్సి ఉంటుంది.అప్పుడే బిడ్డకు అవసరమైన పోషకాలు అందుతాయి.

ఫిష్‌లో ఉండే ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు శిశువు కళ్లు, మెదడు అభివృద్ధి చెందేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అదేవిధంగా, ప్ర‌తి రోజు పాలు, పెరుగు, గుడ్డు వంటివి ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

వారానికి రెండు సార్లు అయినా ఆకుకూర‌లు తినాలి.అప్పుడే త‌ల్లి, బిడ్డ‌ ఆరోగ్యంగా ఉంటుంది.

#Health #Best Food #Pregnant #Pregnancy Women #BestFood

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు