ఈ క్రీమ్ లో ఇది కలిపి ముఖానికి రాస్తే ఎంతటి తెల్ల ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది  

  • చాలా మంది ముఖం నల్లగా ఉందని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే నల్లని ముఖం తెల్లని ఛాయలో మెరవాలని బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆలా తిరుగుతూ చాలా డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఈ ఒక్క చిట్కాను ఫాలో అయితే డబ్బు ఆదా అవ్వటమే కాకుండా పార్లర్ ల చుట్టూ తిరగవలసిన శ్రమ తప్పుతుంది.

  • ఈ చిట్కా చర్మంపై పేరుకుపోయిన మలినాలు,తాన్,నలుపును తొలగించి ముఖ చర్మం తెల్లగా,అందంగా ,మెరిసేలా చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది. వాతావరణంలో కాలుష్యం,దుమ్ము,ధూళి కారణంగా ముఖం నిర్జీవంగా మారిపోతుంది. నిర్జీవంగా మారిన ముఖం తాజాగా మారటానికి ఈ చిట్కా బాగా సహాయపడుతుంది. ఈ చిట్కాలో ముఖ్యంగా అవసరం అయ్యేది NIVEA CREAM. సాధారణంగా NIVEA CREAM ని చర్మం తేమగా ఉంచటానికి ఉపయోగిస్తాం. కానీ ఇప్పుడు చెప్పే విధంగా వాడితే ముఖం మృదువుగా మారటమే కాకుండా తెల్లగా మారుతుంది.

  • ఈ చిట్కాకు కావలసిన వస్తువుల గురించి తెలుసుకుందాం. NIVEA CREAM, PONDS POWDER, తేనే అవసరం అవుతాయి. PONDS POWDER చర్మాన్ని తెల్లగా మార్చటానికి సహాయపడుతుంది. తేనే చర్మానికి తేమను అందించి చర్మం మృదువుగా,కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

  • ముందుగా ఒక బౌల్ లో ఒక స్పూన్ NIVEA CREAM ,పావు స్పూన్ PONDS POWDER, కొద్దిగా తేనే వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ముఖానికి రాసి 5 నిముషాలు మసాజ్ చేసి ఒక గంట తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ ప్యాక్ వేసినప్పుడు బయటకు వెళ్ళటం గాని మాట్లాడటం గాని చేయకూడదు ఈ విధంగా ఒక వారం పాటు చేస్తే మీ ముఖం మీద మృతకణాలు,మలినాలు తొలగిపోయి ముఖం మృదువుగా,అందంగా కాంతివంతంగా,తెల్లగా కనపడుతుంది.