బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ సీఎం లిస్ట్‌ : ఏపీ సీఎం జగన్‌ది ఎన్నో స్థానమో తెలుసా?  

Best Cm In Ap Jagan Get Fourth Place All Over India-jagan,main National Media Condcut The Survey,up Cm Aditya Yoginath

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఒకటి దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఉత్తముడు ఎవరు అనే సర్వేను నిర్వహిస్తూ ఉంటుంది.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సర్వేను నిర్వహించడం జరిగింది.

Best CM IN AP Jagan Get Fourth Place All Over India-Jagan Main National Media Condcut The Survey Up Cm Aditya Yoginath

ఆ సర్వేలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నాల్గవ స్థానంలో నిలిచాడు.ఆయన అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినా అప్పుడే బెస్ట్‌ సీఎంగా జాబితాలో నిలవడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తుంది.

సీఎంగా ఎంపిక అయిన వెంటనే పలు సంక్షేమ పథకాలు తీసుకు రావడంతో పాటు పలు నిర్ణయాలు చకచక తీసుకున్నాడు.అందుకే సీఎం జగన్‌ నాల్గవ స్థానంలో నిలిచాడంటున్నారు.

ఇక మొదటి స్థానంలో ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్య నాద్‌ నిలిచారు.ఆయన చాలా ప్రజామోధమైన పథకాలు ప్రారంభించడంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సీఎంలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ యూపీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఎక్కువ ఓట్లు గుప్పించారు.

ఆ తర్వాత రెండవ స్థానంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నాడు.కేజ్రీవాల్‌ ఒక మంచి పరిపాలకుడిగా వ్యవహరిస్తున్నాడు అంటూ సర్వేలో జనాలు పేర్కొన్నారు.

ఇక మూడవ స్థానంలో మమత బెనర్జీ నిలిచింది.నాల్గవ స్థానంను బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌తో కలిసి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దక్కించుకున్నారు.

ఈ జాబిత టాప్‌ లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్థానం దక్కించుకోలేక పోయారు.

తాజా వార్తలు