బంగాళదుంపలో ఉన్న అద్భుతమైన చర్మ ప్రయోజనాలు  

Best Benefits And Uses Of Potato Juice For Skin And Health-

బంగాళదుంపను వండినప్పుడు రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే పిండిపదార్ధాలు మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. బంగాళదుంప ఆరోగ్య ప్రయోజనాలనే కాక సౌందర్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

బంగాళాదుంప చర్మ ప్రయోజనాలు

బంగాళదుంప చర్మ సంరక్షణలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. దీనిలో చర్మ ఆరోగ్యాన్ని నిర్వహించే విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. అయితే బంగాళదుంప చర్మానికి ఎలా సహాయపడుతుందో చూద్దాం.

1. నల్లటి వలయాలను తగ్గిస్తుంది

కంటి కింద నల్లటి వలయాలను తగ్గించటంలో బంగాళదుంప చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బంగాళదుంప రసం లేదా నేరుగా బంగాళదుంపను రాయవచ్చు.
* పచ్చి బంగాళదుంపను ముక్కలుగా కోయాలి.
* ఈ ముక్కలను ఒక పలుచని క్లాత్ లో వేసి కళ్ళ మీద 15 నిమిషాల పాటు పెట్టాలి.
* ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
* ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే క్రమంగా నల్లటి వలయాలు తగ్గుతాయి.
* అలాగే నల్లటి వలయాలకు బంగాళదుంప రసాన్ని కూడా రాయవచ్చు,

2. ముడతలను తగ్గిస్తుంది

బంగాళదుంప ముడతలను తగ్గించటమే కాకుండా యాంటీ- ఏజింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది
* బంగాళదుంప రసాన్ని ప్రతి రోజు ముఖానికి రాస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
* అలాగే చర్మం మృదువుగా మారి ముడతలను తగ్గిస్తుంది.

3. నల్లని మచ్చలు

నల్లని మచ్చలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
* బంగాళదుంప బ్లెండర్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
* ఈ పేస్ట్ ని ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.
* ఐదు నిముషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. మచ్చలు

ముఖ రూపాన్ని ప్రభావితం చేసే మచ్చలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
* ప్రతి రోజు చల్లని బంగాళదుంప రసాన్ని ముఖానికి రాయాలి.
* ఈ విధంగా ప్రతి రోజు చేస్తే మచ్చలు తొలగిపోతాయి.
* స్పష్టమైన మరియు పరిపూర్ణమైన చర్మాన్ని బహిర్గతం చేస్తుంది.

5. సన్ బర్న్

సన్ బర్న్ తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
* చల్లని బంగాళదుంప ముక్కను ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి.
* చర్మానికి ఓదార్పు మరియు శీతలీకరణ అనుభూతిని కలిగించి సన్ బర్న్ తగ్గించటంలో సహాయపడుతుంది.