చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు   Best Benefits And Uses Of Grape     2017-06-02   01:05:22  IST  Raghu V

పండ్లలో రాణి” గా పేరు గాంచిన వైటేసి కుటుంబానికి చెందిన ద్రాక్ష రంగును బట్టి ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు / నీలం అనే మూడు రకాలుగా విభజించారు. మన ఆహారంలో ద్రాక్షను చేరిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి మరియు తక్షణ శక్తిని అందించే సాధారణ చక్కెరలు ఉంటాయి.

సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించటానికి ప్యాక్

కావలసినవి
కొంచెం గుజ్జు ద్రాక్ష

పద్దతి

ద్రాక్ష గుజ్జును ప్రభావిత ప్రాంతంలో నిదానంగా రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.

ఎలా పనిచేస్తుంది?

ద్రాక్షలో ప్రొనాంథోసైనిడిన్‌ మరియు రెస్వెట్రాల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. చర్మంపై ద్రాక్ష రసాన్ని రాసినప్పుడు హానికరమైన అతినీలలోహిత వికిరణం నుండి రక్షణను అందిస్తుంది. సూర్యరశ్మి కారణంగా వచ్చే ఎరుపుదనం తగ్గటానికి సన్ స్క్రిన్ లోషన్ రాయాలి. అంతేకాక దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్త కణాల పునరుద్దరణకు సహాయపడుతుంది.

ఏజింగ్ కి వ్యతిరేకంగా ప్యాక్

కావలసినవి

గింజలు లేని ద్రాక్ష గుజ్జు

పద్దతి

ద్రాక్ష గుజ్జును ముఖానికి రాసి వృత్తాకార కదలికలతో మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎలా పనిచేస్తుంది?
అకాల వృద్ధాప్యంనకు ఫ్రీ రాడికల్స్ ప్రధాన కారణంగా ఉన్నాయి. ఇవి చర్మం మీద ముడతలు మరియు లైన్స్ రావటానికి కారణం అవుతాయి. ద్రాక్షలో ఉండే యాంటి ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే హానికరమైన ప్రభావాలు నుండి చర్మాన్ని రక్షించటానికి మరియు ముడుతలు, నల్లని మచ్చల తగ్గించటానికి సహాయపడుతుంది. ద్రాక్షలో ఉండే విటమిన్ C కొల్లాజెన్ ఏర్పాటు చేసి చర్మం స్థితిస్థాపకతను నిలుపుకోవడానికి మరియు వృద్ధాప్య లక్షణాలను వ్యతిరేకించటంలో సహాయపడుతుంది.