సాధారణంగా పురుషులు ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపరు.దాంతో ముప్పై, నాలబై ఏళ్లు వచ్చే సరికి.బలహీనంగా మారి పోతుంటారు.ఏ పనీ చేయలేకపోతుంటారు.అలసట, నీరసం వంటి సమస్యలతో అధికంగా ఇబ్బంది పడుతుంటారు.అందుకే పురుషులు ఖచ్చితంగా తమ డైట్‌లో కొన్ని ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది.
మరి ఆ ఆహారాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషుల డైట్‌లో తప్పకుండా ఉండాల్సిన ఆహారాల్లో పెరుగు ఒకటి.
ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల.శరీరానికి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు అందుతాయి.
మరియు శరీరానికి కావాల్సిన శక్తి కూడా పుష్కలంగా లభిస్తుంది.
అలాగే ఉదయాన్నే నాన బెట్టిన బాదం పప్పులను నాలుగు నుంచి ఆరు వరకు తీసుకోవాలి.
పురుషులు రెగ్యులర్‌గా బాదం పప్పులు తీసుకుంటే.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.అధిక బరువుకు దూరంగా ఉంటారు.
మరియు చర్మం కూడా యవ్వనంగా ఉంటుంది.
పురుషులు తీసుకోవాల్సిన ఆహారాల్లో బంగాళ దుంప ఒకటి. బంగాళ దుంపను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.దాంతో నీరసం, అలసట వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
తృణధాన్యాలను కూడా ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.పురుషుల శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్స్, వివిధ రకాల ఫైటోకెమికల్స్ తృణధాన్యాలు ద్వారా పొందొచ్చు.
ఇక బీన్స్, వంకాయ, వేరు శెనగలు, బచ్చలి కూర, పాల కూర, డార్క్ చాక్లెట్, క్యారెట్, గుడ్డు, చేపలు, గ్రీన్ టీ, అరటి పండ్లు, పుచ్చ కాయ, జామ పండ్లు వంటి ఆహారాలను కూడా పరుషులు తమ డైట్‌లో చేర్చుకుంటే.హెల్తీగా, ఫిట్‌గా ఉంటారు.