భార్య భర్తల వయసులో భారీ వ్యతాసం ఉంటే ఎలాంటి నష్టాలు ఉన్నాయో తెలుసా.?

సాధారణంగా భార్యభర్తల్లో….భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉంటుంది.

 Best Age Difference For Husband And Wife-TeluguStop.com

ఇది ఇలాగే ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుందాం….అయితే భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం.

కానీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా.? తమకంటే పెద్ద వయసు మహిళలను పెళ్లిచేసుకున్న మగాళ్లతో పోల్చుకుంటే చిన్నవారిని పెళ్లి చేసుకున్న పురుషులు అధిక సంతృప్తితో ఉన్నారని పరిశోధన బృందంలో సభ్యుడు టెర్రా మెక్‌నీశ్ తెలిపారు.మహిళల్లోనూ ఇలాంటి భావనే వ్యక్తమైందని పేర్కొన్నారు.సమాన వయసున్న జంటలతో పోల్చితే భార్యభర్తల వయసులో ఎక్కువ వ్యత్యాసం ఉన్నవారి వైవాహిక జీవితంలో అసంతృప్తి చోటుచేసుకున్నట్లు గుర్తించామని తెలియజేశారు.

ఈ అసంతృప్తి కారణంగా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలను కోల్పోవడమే కాదు, వారి సామర్థ్యాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిందంట.

వయసు వ్యత్యాసం తక్కువ ఉన్నవారితో పోల్చితే ఎక్కువ అంతరం ఉన్న జంటలలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు వైవాహిక జీవితంలో అసంతృప్తి అధికమైనట్లు అధ్యయనం తెలియజేసింది.

సమవయస్కులైన భార్యభర్తలు జీవితంలో తీసుకునే నిర్ణయాలు వారి పిల్లలు, అలవాట్లపై కూడా ప్రభావం చూపుతాయి.అలాగే ఆర్థిక సర్ధుబాట్ల విషయంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుతారని మెక్‌నీశ్ వివరించారు.

ఈ అధ్యయన ఫలితాలను జర్నల్ ఆఫ్ పాపులేషన్ ఎకనమిక్స్‌లో ప్రచురించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube