ఇండియాలో లభ్యమౌతున్న 6 ఎయిర్ బాగ్స్ కలిగిన టాప్ కార్లు ఇవే!

నేటి దైనందిత జీవితంలో వాళ్ళు, వీళ్ళు అనే తేడాలేకుండా అందరూ సౌకర్యం కోసం ఎంతో వెచ్చిస్తున్నారు.కుటుంబంతో పాటు దూర ప్రయాణాలు చేయడానికి కారుని ఒక ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు.

 Best 6 Airbag Cars In India,six Airbags,cars With Six Airbags,india.safety Cars,-TeluguStop.com

ఎంచుకోవడమే కాదు, దానికోసం లక్షలు వెచ్చించి మరీ వారికి అనువైన కారుని సొంతం చేసుకోవడానికి యత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎక్కువమంది సేఫ్టీ కోసమని 6 ఎయిర్ బాగ్స్ కలిగిన కార్ల( Cars with 6 Airbags ) గురించి వెతుకుతున్నారు.

అయితే అలాంటి అద్భుతమైన కార్లు మనకి అందుబాటులో వున్నాయి.

తాజా సర్వేల ప్రకారం మనదగ్గర కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి.కొనుగోలుదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లను ఎంచుకోవడం గమనార్హం.ముఖ్యంగా అలాంటి వారికోసం 6 ఎయిర్ బ్యాగులు( 6 Airbags ) కలిగి తక్కువ ధరకు లభించే టాప్-5 కార్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మొదటగా మనం “హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్”( Hyundai Grand i10 Nios ) గురించి మాట్లాడుకోవాలి.దీని ధర దేశీయ మార్కెట్లో రూ.7.95 లక్షల నుంచి రూ.8.51 లక్షల మధ్య వుంది.ఇందులో డ్రైవర్, ఫ్యాసింజర్, సైడ్ ఎయిర్ బ్యాగుల ఆప్షన్ వుంది.ఇది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉంది.

తరువాత “మారుతి సుజుకి బాలెనొ”( Maruti Suzuki Baleno ) గురించి మాట్లాడుకోవాలి.దీని ధర రూ.8.38 లక్షల నుంచి రూ.9.88 లక్షల మధ్య వుంది.దీనిలో కూడా 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి.అలాగే “హ్యుందాయ్ ఆరా” ఓ మంచి ఆప్షన్.6 ఎయిర్ బ్యాగులు కలిగిన హ్యుందాయ్ ఆరా ధర రూ.8.61 లక్షలు.తరువాత “టయోటా గ్లాంజా” కూడా మంచి ఎంపిక.ఇది కూడా 6 ఎయిర్ బ్యాగులు కలిగి ఇండియన్ మార్కెట్లో రూ.8.63 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ధరను కలిగి వుంది.అలాగే “హ్యుందాయ్ ఐ20” కూడా 6 ఎయిర్ బ్యాగులు కలిగి, ధర రూ.9.77 లక్షల నుంచి రూ.11.88 లక్షల మధ్య వుంది.ఇక్కడ పేర్కొన్న ఐదు కార్లలో ఏది ఎంపకచేసుకున్నా వినియోగదారులు మంచి అనుభవాన్ని పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube