15000 రూపాయల లోపే దొరుకుతున్న బెస్ట్ 4G ఫోన్స్ ఇవి

జియో రాకతో ఒక్కసారిగా 4G ఫోన్ల మీద ఆసక్తి పెరిగిపోయింది జనాలకి.4G ఫోన్లు అల్రెడి ఉన్నవారు జియో ఉచిత సర్వీసులు ఎంజాయ్ చేస్తోంటే, 3G యూజర్లు బిక్కమొహాలు వేసుకుంటున్నారు.భవిష్యత్తు ఎలాగో 4G దే.కాబట్టి ప్రపంచంతో పాటు మనము అప్డేట్ అవ్వాలి.మీరే గనుక 15000 రూపాయలకు తక్కువలో మంచి 4G కొనాలనుకుంటే, ప్రస్తుతం మార్కేట్లో ఉన్న ఈ ఫోన్లను పరిశీలించండి.

 Best 4g Smartphones Under 15000 Rupees-TeluguStop.com

* Xiaomi Redmi Note 3 : మనదేశంలో ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫొన్ ఇది.దీని ధర Rs.11,999.LTE తోపాటు VoLTE సేవలు కూడా అందిస్తోంది.3GB RAM, 32 GB మెమోరి,4100 mAh బ్యాటరీ, 16 MP బ్యాక్, 5MP ఫ్రంట్ కెమెరా, 5.5 ఇంచుల డిస్ప్లే (1920×1080 pixels) తోపాటు షియోమి ఫోన్లలో మాత్రమే కనబడే MIUI8 ఈ ఫోన్ సొంతం.అన్ని యాంగిల్స్ లో చూస్తే ఇదే ప్రస్తుతం చీప్ గా దొరుకుతున్న బెస్ట్ 4G స్మార్ట్ ఫోన్.

* Motorola Moto G4 plus : దీని ధర Rs.13,499.5.5 ఇంచుల స్క్రీన్ (1920×1080 pixels), 16MP, 5MP కెమెరాలు, ఆండ్రాయిడ్ మార్ష్మల్లో, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 617 ప్రాసెసర్, 3GB RAM, 32GB మెమోరీ, 3000 mAh బ్యాటరీ, LTE + VoLTE నెట్వర్క్ దీని సొంతం.కెమెరా ప్రేమికులు REDMI NOTE 3 కి బదులు దీన్ని కొనుక్కుంటే బెటర్.అలా కాకుండా బ్యాటరీ లైఫ్, అదనపు ఫీచర్స్ కావలంటే మొదటిదానికే వెళ్ళండి.

* Lenevo Vibe K5 Note : దీని ధర Rs.13,499.5.5 ఇంచుల స్క్రీన్ (1920×1080 pixels), 13 MP, 8 MP కెమెరాలు, ఆండ్రాయిడ్ మార్ష్మల్లో, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4GB RAM, 32 GB మెమోరి, 3500 mAh బ్యాటరీ, LTE నెట్వర్క్ దీని సొంతం.మల్టిటాస్కింగ్ ఎక్కువ చేసేవారు ఈ ఫోన్ తీసుకుంటే బెటర్.

* Xiaomi 3s Prime – దీని ధర Rs.9,999.5 ఇంచుల స్క్రీన్ (1280×720 pixels), 13 MP, 5 MP కెమెరాలు, MIUI 8, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3GB RAM, 32 GB మెమోరి, 4100 mAh బ్యాటరీ, LTE+VoLTE నెట్వర్క్ దీని సొంతం.డిస్ప్లే లో పిక్సెల్స్ తక్కువ.కాని తక్కవ రేటులో అద్భుతమైన బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ ఇది.దీని 2GB RAM + 16 GB internal memory వేరియంట్ కేవలం Rs.6,999లో దొరుకుతోంది.కాబట్టి ఎక్కువగా ఖర్చుపెట్టకుండా నాణ్యమైన స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే దీన్ని తీసుకోవడం బెటర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube