నెవాడాలో శాండర్స్ సంచలన విజయం: ఇక బిడెన్‌తోనే పోటీ, ట్రంప్ అభినందనలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా శనివారం నెవాడాలో జరిగిన కాకసెస్‌లో డెమొక్రాటిక్ పార్టీ నేత బెర్నీ శాండర్స్ సంచలన విజయం సాధించారు.ఈ నిర్ణయాత్మక గెలుపు ద్వారా డెమొక్రాటిక్ అభ్యర్ధిత్వ రేసులో తన స్థానాన్ని శాండర్స్ పటిష్టం చేసుకున్నారు.

 Bernie Sanders Wins Nevada Caucuses Democratic Caucus-TeluguStop.com

ఇప్పటికే మొదటి రెండు కాకసెస్‌లో చివరి స్థానంలో నిలిచి మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ తాజాగా నెవాడాలో జరిగిన కాకసెస్‌లో రెండో స్థానంలోకి దూసుకురావడంతో డెమొక్రాటిక్ అభ్యర్ధిత్వ రేసులో ఆయన ఆశలు సజీవంగా నిలిచాయి.

నెవాడా ప్రైమరీస్‌లో శాండర్స్ 47 శాతం ఓట్లు సాధించగా.43 శాతం మంది బిడెన్ వైపు మొగ్గుచూపారు.శాండర్స్ విజయంలో యువతపాటు, లాటినోలు, కార్మిక సంఘాలు, తెల్లజాతి వర్గాలు అండగా నిలిచారని ఆయన ప్రచార బాధ్యతలు చూస్తున్న ఎడిసన్ రీసెర్చ్ సంస్థ తెలిపింది.65 ఏళ్లు పైబడిన వారుతప్ప మిగిలిన అన్ని వర్గాలు శాండర్స్‌కే జై కొట్టారు.లాటిన్ అమెరికా ఓటర్లలో 54 శాతం, కళాశాల విద్యార్ధులు 24 శాతం, కార్మిక సంఘాలు 34 శాతం ఓట్లు శాండర్స్‌కు మళ్లాయి.

Telugu Bernie Sanders, Democratic, Nevada Caucuses-

ఇక జో బిడెన్ విషయానికి వస్తే.డెమొక్రాటిక్‌ అభ్యర్ధిత్వ రేసులో అయోవా, న్యూహాంప్‌షైర్ కాకసెస్‌లో నాలుగో స్థానానికి పరిమితమైన ఆయన నెవాడాలో మాత్రం రెండో స్థానానికి ఎగబాకి సత్తా చాటారు.మొదటి రెండు ప్రైమరీలలో పేలవమైన ఓట్లు సాధించిన సెనేటర్ ఎలిజబెత్ వారెన్ నెవాడాలో సైతం 9 శాతం ఓట్లు మాత్రమే సంపాదించగలిగారు.ఇదే సమయంలో ఈ నెల 29న సౌత్ కరోలినాలో జరగనున్న ప్రైమరీస్‌పై శాండర్స్, బిడెన్ దృష్టి సారించారు.

దీని తర్వాత మార్చి 3న 14 రాష్ట్రాల్లో సూపర్ ట్యూస్‌డే పోటీలు జరుగుతాయి.మరోవైపు నెవాడాలో శాండర్స్ విజయంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.ఆయన చివరి వరకు ఇలాంటి విజయాలను సాధిస్తూ తనకు బలమైన పోటీ ఇవ్వాలని ట్రంప్ ఆకాంక్షించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube