బెర్నీ వెనుకంజ...ట్రంప్ ని డీ కొట్టేది..బిడెన్...

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినది ఎవరు అనే దానికంటే కూడా డెమొక్రటిక్ పార్టీ తరపున తుది పోరులో నిలిచేది ఎవరు అనేది ఇప్పుడు అమెరికాలో అతిపెద్ద పార్టీ టాపిక్ అవుతుంది.

 Bernie Sanders To Beat Trump Bernie Sanders To Beat Trump Joe Biden-TeluguStop.com

ఈ క్రమంలోనే వెర్మాంట్ సెనేటర్ బెన్నీ శాండర్స్ అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ల మధ్య పోరు తుది దశకు చేరుతోంది.
తాజాగా మీడియాతో మాట్లాడిన బెర్నీ శాండర్స్ ప్రస్తుతం అధ్యక్ష బరిలో తాను వెనుకంజలో ఉన్నట్టు ప్రకటించారు అయితే భవిష్యత్తులో ప్రచారాలు చేస్తారా, ఎన్నికల బరిలో నిలుచుంటారా లేదా అనే విషయాలపై ఆయన వివరణ ఇవ్వలేదు .తొలుత డెమోక్రటిక్ అభ్యర్థి రేసులో మొదటి స్థానంలో నిలిచిన శాండర్స్ ప్రస్తుతం వెనకబడటం పరిశీలకులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Telugu Berniesanders, Donald Trump, Joe Biden-

ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీ నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో శాండర్స్ ఎంతకాలం తన పోరు కొనసాగిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన మద్దతుదారులు.మిస్సౌరీ, ఇడాహో , మిసిసిపీ లలో ఎదురైన పరాజయాలు అనంతరం శాండర్స్ మీడియాని ఉద్దేశించి మాట్లాడటం ఆయన పరాజయాన్ని ఒప్పుకున్నట్లు గానే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.ఈ పరిస్తితిల నేపధ్యంలో ట్రంప్ ని డీ కొట్టగలిగే సత్తా జో బిడెన్ కి మాత్రమే ఉందని అంటోంది స్థానిక మీడియా…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube