చెప్పుతో కొట్టిన మహిళను అత్యంత కిరాతకంగా.. ఓ వ్యక్తి ఘాతుకం.. ?

ఒక వ్యక్తిలో పగ అనే భూతం ప్రవేశించిందంటే దాని పంతం నెరవేర్చుకునే వరకు వదిలి పెట్టదు.ఈ పగ పాముకంటే దారుణంగా ఉంటుంది.

 Bengaluru Woman Stabbed To Death By Neighbour-TeluguStop.com

రాక్షసుని కంటే కౄరంగా ఉంటుంది.చివరికి చావడమా, చంపడమా అనేంత వరకు వెళ్లుతుంది.

ప్రస్తుతం ఇలాంటి ఘటనే బెంగళూర్‌లో వెలుగుచూసింది.ఇక వివరాల్లోకి వెళ్లితే.

 Bengaluru Woman Stabbed To Death By Neighbour-చెప్పుతో కొట్టిన మహిళను అత్యంత కిరాతకంగా.. ఓ వ్యక్తి ఘాతుకం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన భర్తతో కలిసి అలీం బీబీ అనే మహిళ బెంగళూర్‌లోని కుందళహళ్లిలో నివసిస్తున్నారు.ఈ క్రమంలో పొరుగున ఉండే నిందితుడు రఫీకుల్‌ షేక్‌తో ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా వీరిద్దరి మధ్య వివాదం నెలకొంది.

ఈ వివాదం చిలికి చిలికి తుఫానుగా మారగా ఒకగానొక సమయంలో నిందితుడైన రఫీకుల్‌ షేక్‌ ను, బీబీ షేక్‌ను చెప్పుతో కొట్టిందట.ఇది తీవ్ర అవమానంగా భావించిన షేక్‌ మనసులో పెట్టుకుని సమయం కోసం కాచుకు కూర్చున్నాడట.

కాగా నిన్న ఆదివారం ఒంటరిగా దొరికిన బీబీ షేక్‌ ను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి పరారయ్యాడట.తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే మరణించగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్దలానికి చేరుకుని మృతదేహన్ని మార్చూరికి తరలించి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారట.

#Bangalore #Woman Stabbed #Death #Neighbour #Slipper

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు