విడ్డూరం : ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు వరుడు చెప్పిన కారణం వింటే థూ నీ బతుకు అంటారు  

bengaluru man claims to be hiv positive to avoid marriage - Telugu Bengaluru Man, , Karnataka One Marriage Viral In Social Media, Karnataka State, Telugu General News, Telugu Viral News

పీఠల మీదకు వచ్చిన పెళ్లిలు ఆగిపోవడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం.ప్రతి రోజు కూడా ఏదో ఒక చోట ఇలాంటి సంఘటలు జరుగుతుంటాయి.

Bengaluru Man Claims To Be Hiv Positive To Avoid Marriage

ఎక్కువ శాతం పెళ్లిలు ఇరు వర్గాల ఒప్పందంతో క్యాన్సిల్‌ అవుతాయి.కాని కొన్ని పెళ్లిలు మాత్రం చాలా వింతైన కారణాలతో, అరుదైన కారణాలతో క్యాన్సిల్‌ అవుతూ ఉంటాయి.

కర్ణాటకలో మరో అదురైన పెళ్లి క్యాన్సిల్‌ జరిగింది.ప్రస్తుతం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కూడా ఈ వింతైన పెళ్లి క్యాన్సిల్‌ గురించి మాట్లాడుకుంటున్నారు.

అలాగే ఆ పెళ్లి కొడుకుపై బూతులు తిడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కర్ణాటక రాష్ట్రం విజయనగర ప్రాంతంకు చెందిన కిరణ్‌ అనే వ్యక్తి పెళ్లి పిక్స్‌ అయ్యింది.కుటుంబ సభ్యులు అతడిని బలంతంగా పెళ్లికి ఒప్పించారు.

అప్పటికే అతడు ప్రేమలో ఉన్నాడు.కుటుంబ సభ్యులకు ఆ విషయం చెప్పలేక, పెళ్లి కాదనలేక పోయాడు.

మరో రెండు మూడు రోజుల్లో పెళ్లి అనగా తనకు ఎయిడ్స్‌ ఉందంటూ తన గురించి తానే బ్యాడ్‌ గా ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టాడు.ఆ విషయం ఆనోట ఈనోట పడి అమ్మాయి వారికి తెలిసింది.

విషయం తెలిసిన వెంటనే పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంటున్నట్లుగా అమ్మాయి తరపు వారు చెప్పుకొచ్చారు.

పెళ్లి క్యాన్సిల్‌ అవ్వడంతో అమ్మాయి వారికి 15 లక్షల వరకు నష్టం వచ్చింది, అలాగే అబ్బాయికి ఇచ్చిన 10 లక్షలు కూడా తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు.బిడ్డ భవిష్యత్తు కోసమని అవన్ని కూడా వదిలేశారు.పెళ్లి క్యాన్సిల్‌ తర్వాత అబ్బాయి ప్రవర్తన కాస్త అనుమానంగా అనిపించడంతో విజయనగర పోలీసులకు అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు.హాస్పిటల్‌కు అతడిని తీసుకు వెళ్లి హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించారు.ఆ టెస్టులో కిరణ్‌ కు ఎయిడ్స్‌ లేదని వెళ్లడయ్యింది.

తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇలా నాటకం ఆడాను అంటూ కిరణ్‌ పోలీసులకు తెలియజేశాడు.

అమ్మాయి తరపు వారిని చీట్‌ చేసినందుకు గాను చీటింగ్‌ కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు.అమ్మాయి తరపు వారు తాము పెట్టిన ఖర్చును ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

మరి ఇది ఎక్కడికి దారి తీసేనో చూడాలి.

#Karnataka State #Bengaluru Man

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bengaluru Man Claims To Be Hiv Positive To Avoid Marriage Related Telugu News,Photos/Pics,Images..