ఆ హెల్మెట్‌లు పెట్టుకున్నా ఫైన్‌ తప్పదు

కేంద్ర ప్రభుత్వం కొత్త రవాణ చట్టంను తీసుకు వచ్చి ఫైన్‌లను, చలానాలను భారీగా పెంచిన విషయం తెల్సిందే.ముఖ్యంగా హెల్మెట్‌ పెట్టుకోకుంటే ఏకంగా వెయ్యికి చలానా పెంచడం జరిగింది.

 Bengaloore Trafic Police Produce The New Rule Of No Wear The Half Helmets Ts Ne-TeluguStop.com

గతంలో వంద ఉన్న ఈ చలానాను ఇంతగా పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.చేసేది లేక తమ వద్ద ఉన్న ఏదో ఒక హెల్మెట్‌ అంటూ పెట్టుకుంటున్నారు.

కొందరు చలానాను తప్పించుకునేందుకు చిప్ప హెల్మెట్‌లను వాడుతున్నారు.ఆ హెల్మెట్స్‌ వల్ల ప్రమాదం నుండి సేఫ్టీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

అందుకే వాటిని వాడిన వారిని కూడా శిక్షించాలని నిర్ణయించుకున్నారు.

ప్రయాణికుల సేఫ్టీ కోసం తాము ఈ పనులు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

తాజాగా బెంగళూరు పోలీసులు ఈ కొత్త రూల్‌ను తీసుకు వచ్చారు.హాఫ్‌ హెల్మెట్‌ అంటూ పెట్టుకున్న వారికి హెల్మెట్‌ లేనట్లుగానే పరిగణించబడుతుందన్నారు.

ఇకపై వాహనదారులు హాఫ్‌ హెల్మెట్స్‌ కొనుగోలు చేయవద్దని వినియోగదారులకు పోలీసులు సూచిస్తున్నారు.ఇలా చేయడం వల్ల బైక్‌ రైడర్స్‌ ప్రమాదం జరిగినా ప్రాణాపాయ స్థితికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుందని అంటున్నారు.

అంతే కాకుండా బండి డ్రైవ్‌ చేస్తున్న వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్‌ పెట్టుకోవాల్సిందే అంటూ పోలీసులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube