ఆ డైరెక్టర్ తో ఒక్క రాత్రి పడుకుంటే అవకాశం ఇస్తానన్నాడు...

ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమ ఏదైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు తరచుగా వినిపిస్తోంది.కానీ ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం గతంలో మాదిరిగా చాటుమాటుగా జరగడం లేదు.

 Bengali Actress Payal Sarkar Facing Casting Couch In Social Media, Bengali Actre-TeluguStop.com

అయితే ఈ మధ్య క్యాస్టింగ్ కౌచ్ పై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగడంతో సినీ సెలబ్రిటీలు మరియు ఇతరులు ధైర్యంగా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి ప్రేక్షకులకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.కాగా తాజాగా బెంగాలీ సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్ పాయల్ సర్కార్ కాస్టింగ్ కౌచ్ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేగాకుండా తాను ఎదుర్కొన్న ఓ లైంగిక వేధింపుల సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా పలు టాలీవుడ్ చిత్రాలను బెంగాలీ భాషలో అనువాదం చేసి విడుదల చేసిన బెంగాలీ ప్రముఖ దర్శకుడు “రవి కినాగి” ఫేస్ బుక్ ప్రొఫైల్ ఖాతా ద్వారా ఓ రోజు రాత్రి తనకి మెసేజ్ వచ్చిందని దాంతో ఒక్కసారిగా అవాక్కయ్యానని తెలిపింది.

అయితే ఆ మెసేజ్ లో ఒక్కరోజు రాత్రి తనతో గడిపితే తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆఫర్ ఇస్తానంటూ తెలియజేస్తూ పడక గది కమిట్ మెంట్ అడిగినట్లు తెలిపింది.ఈ మెసేజ్ చదివిన తర్వాత కొంత సమయం పాటు అయోమయంలో పడ్డానని కానీ అయోమయంలో నుంచి తేరుకుని చూస్తే తనకి మెసేజ్ వచ్చినటువంటి ప్రొఫైల్ ఖాతా దర్శకుడు రవి కినాగి ది కాదని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతా సృష్టించి తనకు మెసేజ్ చేస్తున్నారని అర్థం చేసుకుని వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.

దీంతో ఇటీవలే దర్శకుడు రవి కినాగి కూడా ఈ విషయంపై స్పందిస్తూ తాను సోషల్ మీడియా మాధ్యమాలకు చాలా దూరంగా ఉంటానని కాబట్టి తన పేరు మీదగా ఎవరికైనా మెసేజ్ వస్తే పెద్దగా పట్టించుకోవద్దని సూచించాడు.అంతేకాకుండా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.

Telugu Bengali Actress, Bengaliactress, Bengali, Payal Sarkar, Ravi Kinagi-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా టాలీవుడ్ కి సంబంధించిన దాదాపుగా 20 కి పైగా చిత్రాలను దర్శకుడు రవి కినాగి బెంగాలీ భాషలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.అయితే ఇందులో వస్తానంటే నేనొద్దంటానా, సంతోషం, తమ్ముడు, నీ స్నేహం, బొమ్మరిల్లు, అతడు, భద్ర, లక్ష్యం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అలాగే ఇటీవలే కన్నడ భాషలో విడుదలైన “కృష్ణ లీల” తదితర చిత్రాలను రీమేక్ చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube