బెంగాలీలోకి రీమేక్ అయిన తెలుగు సినిమాలేంటో తెలుసా?

ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మిగతా భాషల్లోకి రీమేక్ చేయడం సాధారణం.అయితే రీమేక్ సినిమాలు ఆయా భాషల్లో హిట్ కావొచ్చు కాకపోవచ్చు.

 Bengal Movies In Tollywood , Remake Movies , Chhatrapati , Mirchi , Maghadeera ,-TeluguStop.com

అటు మరికొన్ని సినిమాలు డబ్ అవుతుంటాయి.ఇవి కూడా పలు భాషల్లో ఒక్కోసారి మంచి జనాదరణ దక్కించుకుంటాయి.

మరికొన్ని సార్లు అవికూడా విజయాన్ని అందుకోవు.అయితే ఒరిజినల్ కంటెంట్ బాగున్న.

రీమేక్ లో జరిగిన కొన్ని పొరపాట్ల మూలంగా ఆయా సినిమాలు ఫ్లాప్ అవుతాయి.అందుకే కొన్నిసార్లు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు.

ఒక వేళ ఇచ్చినా.ఒరిజినల్ సినిమా కంటే నేటివిటీకి అనుగుణంగా ఉంటాయి.

అయితే పలు తెలుగు సినిమాలు బెంగాలీలోకి రీమేక్ అయ్యాయి.వాటిలో పలు తెలుగు బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి.

ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

*ఛత్రపతి తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమా బెంగాలీలో రెఫ్యూజీ పేరుతో రీమేక్ అయ్యింది.

అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

*మిర్చి ప్రభాస్ హీరోగా చేసిన ఈ సూపర్ హిట్ మూవీ బెంగాల్ లో బిందాస్ పేరుతో రీమేక్ అయ్యింది.

*మగధీర మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర సినిమాను బెంగాలీలో యోధ పేరుతో రీమేక్ చేశారు.

*ఒక్కడు మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ఒక్కడు సినిమాను జీత్ పేరుతో రీమేక్ చేశారు.

*డార్లింగ్ ప్రభాస్ మూవీ డార్లింగ్ ను బెంగాలీలో కూడా అదే పేరుతో తీశారు.

*రెబెల్ రెబల్ సినిమాను బెంగాల్లో హీరో-సూపర్ స్టార్ పేరుతో రీమేక్ చేశారు.

*బిజినెస్ మాన్ ఈ సినిమాను బెంగాల్ లో బాస్ పేరుతో తీశారు.

అత్తారింటికి దారేది- అభిమాన్ గా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా 100 పర్సెంట్ లవ్, ఇంద్ర సినిమా దాదా పేరుతో రీమేక్ అయ్యాయి.నాన్నకు ప్రేమతో సినిమా బాజీ పేరుతో తీశారు.దూకుడు సినిమాను ఛాలెంజ్ 2 పేరుతో తీశారు.

ఇవే కాకుండా పలు తెలుగు సినిమాలు బెంగాలీలో తెరకెక్కాయి.

Bengal Movies In Tollywood , Remake Movies , Chhatrapati , Mirchi , Maghadeera , Vakkadu , Darling , Rebal , Business Man , Attarintiki Daaredi , 100 Persent Love , Endra , Prabas , Chiranjeevi , Mahesh Babu - Telugu Love, Chhatrapati, Chiranjeevi, Endra, Maghadeera, Mahesh Babu, Mirchi, Prabas, Rebal, Vakkadu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube