మీకు జీకేలో నాలెడ్జ్ ఉందా.. అయితే ఇతడి ఆటోలో ఫ్రీగా వెళ్లొచ్చు!

Bengal E Rickshaw Driver Gives Free Rides To Passengers Who Nail Gk Quiz

జెనరల్ నాలెడ్జ్ అనేది చదువుతో సంబంధం లేని విషయం అని ఇతడు నిరూపిస్తున్నాడు.కొంత మంది ఎంత చదువుకున్న కూడా జెనరల్ నాలెడ్జ్ లో వీక్ గా ఉంటారు.

 Bengal E Rickshaw Driver Gives Free Rides To Passengers Who Nail Gk Quiz-TeluguStop.com

మరి కొంత మంది అయితే చదువు లేకపోయినా కూడా జెనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటూ లోకజ్ఞానాన్ని సంపాదించు కుంటారు.అందరికి చదువుకునే అదృష్టం ఉండదు.

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంత మంది చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ముఖ్యంగా ఆర్థికంగా సమస్యలు ఉంటే మాత్రం చదువు ఆపేయక తప్పదు.

 Bengal E Rickshaw Driver Gives Free Rides To Passengers Who Nail Gk Quiz-మీకు జీకేలో నాలెడ్జ్ ఉందా.. అయితే ఇతడి ఆటోలో ఫ్రీగా వెళ్లొచ్చు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అలా చదువు మధ్యలోనే ఆపేసిన వారిలో కొంత మంది చదువు ఆపేసిన తర్వాత కూడా జనెరల్ నాలెడ్జ్ గురించి ఎక్కువుగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.తమకు ఇష్టమైన టాపిక్స్ గురించి తెలుసుకుంటు ఉంటారు.

ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి కూడా అలా చదువు మధ్యలోనే ఆపేసాడు.తనకు చదువు కోవాలని ఉన్న కూడా ఆర్థిక కారణాల వల్ల 5వ తరగతి వరకే చదువుకుని ఆపేసాడు.

కానీ అతడు మాత్రం చదువు ఆపేసిన తర్వాత కూడా జెనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు.పశ్చిమ బెంగాల్ కు చెందిన సురంజన్ కర్మాకర్ ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు.

అతడు తన ఆటో లో   ఎక్కే వారికీ జెనెరల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటాడు.అవి కరెక్ట్ చెప్తే వారిని ఉచితంగా తీసుకుని వెళ్తాడు.

దీంతో ఇతడి ఆటోలో  ఎక్కేందుకు చాలా మంది పోటీ పడుతున్నారట.తాజాగా ఈయన ఆటోలో  దంపతులు ఎక్కారు.

వారిని  కూడా అలాగే ప్రశ్నలు అడిగాడు.అయితే అతడు అన్ని రకాల జికె ప్రశ్నలు వేయడంతో వారు ఆశ్చర్య పోయారట.

Telugu Auto Rickshaw, Bengal E-rickshaw Driver Gives Free Rides To Passengers Who Nail Gk Quiz, Gk, Social Media, Viral, West Bengal-Latest News - Telugu

తాను 6వ తరగతి మాత్రమే చదువు కున్నానని చదవాలనే ఆసక్తి ఉన్న ఆర్ధిక స్థోమత బాలేక చదవలేక పోయానని ఆయన తెలిపాడు.అంతేకాదు తనకు నైట్ 2 గంటల వరకు పుస్తకాలూ చదివే అలవాటు ఉందని.తాను లిలూయా బుక్ ఫెయిర్ ఫౌండేషన్ లో సభ్యుడిగా కూడా ఉన్నానని.కావాలంటే గూగుల్ లో కూడా సర్చ్ చేసుకోండి.అని ఆ దంపతులతో చెప్పి షాక్ ఇచ్చాడు ఆటోవాలా.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#BengalRickshaw #Auto Rickshaw #West Bengal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube