నరేంద్ర మోదీ పై నిప్పులు జిమ్ముతున్న మమతా బెనర్జీ.. ?

పశ్చిమ బెంగాల్ లో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతుంది.మాటల యుద్దంలో బీజేపీ నేతలు, తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు.

 Bengal Cm Mamata Benerjee Fires On Narendra Modi-TeluguStop.com

తీవ్రమైన ఆరోపణలు, విమర్శల బాణాలు జోరుగా వెలువడుతున్నాయి.

ఈ క్రమంలో ఎన్నికల్లో భద్రత నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బలగాలు బీజేపీకే ఓటు వేయాలని, పశ్చిమ బెంగాల్ ఓటర్లను బెదరిస్తున్నాయని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.

 Bengal Cm Mamata Benerjee Fires On Narendra Modi-నరేంద్ర మోదీ పై నిప్పులు జిమ్ముతున్న మమతా బెనర్జీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బీజేపీ నేతలు నిర్వహించిన సభలకు ప్రజలు రాలేదని, దీంతో మోహం చెల్లక రాష్ట్రానికి రాలేక, ఢిల్లీలో కూర్చుని ఈ తరహా కుట్రకు తెరతీశారని విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉండగా ట్రంప్ తో పోలిస్తే, నరేంద్ర మోదీ మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారని, అమెరికా లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటువంటి ఘోరాలను చేయలేదంటూ మమతా బెనర్జీ మండిపడ్డారు.

ఇక ప్రజల మధ్య మతాల పేరిట చిచ్చు పెడుతున్న నేతలు ఉన్న పార్టీ బీజేపీ దుయ్యబట్టారు.ఇంత మాట్లాడుతున్న ఈ రెండు పార్టీలు తాపత్రయపడేది పదవుల కోసం అని ఆలోచించని వెర్రి ఓటర్లు లేరు అని అనుకుంటున్నారట వీరి మాటలను ఎంజాయ్ చేస్తున్న కొందరు.

#Fires #Mamata Benerjee #Narendra Modi #Bengal Cm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు