అరటితొక్కను పడేయొద్దు  

Benefits You Get From Banana Peel-

కూరలో కరివేపాకు ఎలా పడేస్తారో, అరటిపండు తింటూ అరటితొక్కను అలానే పడేస్తారు.పనికిరాని వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు “తొక్క” అనే పదాన్ని వాడటం అలవాటు కాబట్టి అనుకుంటా, అరటితొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు.

అరటితొక్క వలన ఎన్ని లాభాలో మీరే చూడండి.

Benefits You Get From Banana Peel--తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. --

* అరటిపండులోనే కాదు, అరటితొక్కలో కూడా ఫైబర్ బాగా లభిస్తుంది.

ఇందులో సోలుబుల్ ఫైబర్ తోపాటు ఇంసోలుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది.

* అరటితొక్కలో ఫైటోకెమికల్స్, కరేటోనైడ్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి చాలా మఖ్యమైన యాంటిఆక్సిడెంట్స్.

* లూటిన్ అనే మరో మఖ్యమైన యాంటిఆక్సిడెంట్ అరటితొక్క సొంతం.

ఈ యాంటిఆక్సిడెంట్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.ఫ్రీరాడికల్స్ నుంచి విముక్తినివ్వడం, ప్రమాదకరమైన యూవీ రేస్ నుంచి రక్షించడం దీని స్పెషాలిటి.

* అరటితొక్కతో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు తెలుసా.పచ్చగా మారిన దంతాలకు అరటితొక్క మరింత ఉపయోగపడుతుంది.

* మొటిమల నుంచి విముక్తి పొందానుకునేవారికి, నిగనిగలాడే చర్మం కావాలనుకునే వారికి అరటితొక్క చాలా చవకగా దొరికే మెడిసిన్ లాంటిది.అంతేకాదు, ఇది ముడతల ఇబ్బందిని కూడా తగ్గిస్తుంది.

* దురదగా, మంటగా ఉన్న ప్రాంతాల్లో అరటితొక్కను రాస్తే ఉపశమనాన్ని పొందవచ్చు.పూర్వకాలంలో చైనాలో అరటితొక్కను దోమకాటు వలన వచ్చే మంట, దురదను తగ్గించుకోవడానికి వాడేవారట.

అరటితొక్క ఇంతగా ప్రభావం చూపడానికి కారణం ఇందులో ఉండే యాంటిహిస్టమైన్స్ అనే పదార్థం.

తాజా వార్తలు