గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జామపండు తినండి

జామపండు చాలా చవగ్గా దొరుకుతుంది.ఒకరి ఇంట్లో కాకాపోతే రెండో ఇంట్లో కనబడేది జామచెట్టు.

ఇప్పుడు నగరాల్లో తక్కువగా కనిపిస్తున్నా, కాస్త పల్లేటూళ్ళ వైపు వెళ్ళి చూస్తే జామచెట్లు కనబడటం చాలా కామన్ విషయం.ఈ జామను రోజు తినే అలవాటు ఉన్నవారి గుండె చాలా బలంగా తయారవుతుంది.

అది ఎలా అని అడుగుతున్నారా! * జామలో యాంటిఆక్సిడెంట్స్ కి కొదువ లేదు.మన శరీరానికి ఉపయోగపడే యాంటిఆక్సిడెంట్స్ చాలావరకు జామలో దొరుకుతాయి.

అందులో లైకోపెన్ చాలా మఖ్యమైనది.ఈ లైకోపెన్ ఆర్టెరీస్ ని ఇంఫ్లేమేషన్ నుంచి కాపాడుతుంది.

Advertisement

ఆర్టెరీస్ గుండెకి చేసే సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా.* ఒంట్లో పొటాషియం తక్కువైతే గుండెకి చాలా ప్రమాదం.

ఇలాంటి కండీషన్ గుండెకి పాల్పిటేషన్ లాంటి సమస్యను తీసుకురాగలదు.జామలో పొటాషియం బాగా దొరుకుతుంది.

కాబట్టి నిస్సందేహంగా కుదిరినన్ని జామపండ్లు తినండి రోజు.* విటమిన్ సి అనగానే మనకి ఆరెంజ్ లేదా ఏదైనా సిట్రస్ జాతి ఫలాలు గుర్తుకు వస్తాయి కాని, జామలో ఆరెంజ్ కన్నా ఎక్కువ విటమిన్ సి కంటెంట్ ఉంటుంది తెలుసా.

అది కూడా నాలుగు రేట్లు ఎక్కువ.విటమిన్ సి బ్యాడ్ కొలెస్టరాల్ ని తగ్గించి, గుడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని పెంచి గుండెని సురక్షితంగా ఉంచుతుంది.

వినాయకుడి పూజకు ఈ మొక్కను అస్సలు వాడకూడదు.. ఎందుకో తెలుసా..?

* జామపండు బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచగలదు.దీనికంత సామర్థ్యం ఉంది కాబట్టే ఆయిర్వేదలో దీనికి త్రిదోష నాషక్ అనే పేరు పెట్టారు.

Advertisement

* అరకిలో జామపండ్లలో ఓరోజులో ఒంటికి సరిపడ ఫైబర్ దొరుకుతుంది తెలుసా.జామలో ఫైబర్ దండిగా ఉంటుంది.

ఈ డైటరి ఫైబర్ తో బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ కి చెక్ పెట్టి గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

తాజా వార్తలు