గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జామపండు తినండి  

Benefits That Guavas Bring To Human Heart-

English Summary:I find a lot of jamapandu cavagga. Jamacettu found at the house of one of the latter might not.Now appears to be lower in cities, the most common thing to see a little palletulla jamacetlu look to the side. This can become very strong in the heart of those who have the habit of eating jamanu day.How is it you ask?
* Jamalo not lack of yantiaksidents. Jamalo are most useful for our body yantiaksidents.Makhyamainadi a lot of lycopene. Imphlemesan arteris lycopene to prevent this.Arteris heart ceppanakkaraledanukunta specifically about the service.
* The risk of heart feeling less potassium.Similar to bring the problem of palpitesan heart condition. Jamalo potassium is available as well.So undoubtedly eat Guavas kudirinanni day.
* Vitamin C orange or any citrus fruits when we come to mind, but it is the content of vitamin C than orange jamalo know.It is also more than four rates. Vitamin C can reduce the bad cholesterol, raise the good cholesterol levels in the heart and keeps it safe.
* Jamapandu be able to keep in control of blood pressure. This is because the ability to dinikanta ayirvedalo tridosa named nasak.

జామపండు చాలా చవగ్గా దొరుకుతుంది. ఒకరి ఇంట్లో కాకాపోతే రెండో ఇంట్లో కనబడేది జామచెట్టు. ఇప్పుడు నగరాల్లో తక్కువగా కనిపిస్తున్నా, కాస్త పల్లేటూళ్ళ వైపు వెళ్ళి చూస్తే జామచెట్లు కనబడటం చాలా కామన్ విషయం..

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జామపండు తినండి-

ఈ జామను రోజు తినే అలవాటు ఉన్నవారి గుండె చాలా బలంగా తయారవుతుంది. అది ఎలా అని అడుగుతున్నారా!* జామలో యాంటిఆక్సిడెంట్స్ కి కొదువ లేదు. మన శరీరానికి ఉపయోగపడే యాంటిఆక్సిడెంట్స్ చాలావరకు జామలో దొరుకుతాయి.

అందులో లైకోపెన్ చాలా మఖ్యమైనది. ఈ లైకోపెన్ ఆర్టెరీస్ ని ఇంఫ్లేమేషన్ నుంచి కాపాడుతుంది. ఆర్టెరీస్ గుండెకి చేసే సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా.

* ఒంట్లో పొటాషియం తక్కువైతే గుండెకి చాలా ప్రమాదం. ఇలాంటి కండీషన్ గుండెకి పాల్పిటేషన్ లాంటి సమస్యను తీసుకురాగలదు. జామలో పొటాషియం బాగా దొరుకుతుంది.

కాబట్టి నిస్సందేహంగా కుదిరినన్ని జామపండ్లు తినండి రోజు.* విటమిన్ సి అనగానే మనకి ఆరెంజ్ లేదా ఏదైనా సిట్రస్ జాతి ఫలాలు గుర్తుకు వస్తాయి కాని, జామలో ఆరెంజ్ కన్నా ఎక్కువ విటమిన్ సి కంటెంట్ ఉంటుంది తెలుసా. అది కూడా నాలుగు రేట్లు ఎక్కువ.

విటమిన్ సి బ్యాడ్ కొలెస్టరాల్ ని తగ్గించి, గుడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని పెంచి గుండెని సురక్షితంగా ఉంచుతుంది.

* అరకిలో జామపండ్లలో ఓరోజులో ఒంటికి సరిపడ ఫైబర్ దొరుకుతుంది తెలుసా. జామలో ఫైబర్ దండిగా ఉంటుంది. ఈ డైటరి ఫైబర్ తో బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ కి చెక్ పెట్టి గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.