వింటర్ సీజన్ వచ్చేసింది.ఈ సిజన్‌లో జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా జ్వరాలు ఈ చలి కాలంలోనే ఎక్కవగా ఉంటాయి.అయితే జ్వరం వచ్చేందంటే చాలు.
బ్యాటరీ అయిపోయిన ఫోన్‌లా టక్కున ఎనర్జీ లెవల్స్ అన్ని దిగిపోతుంటాయి.దానికి తోడు నీరసం, అలసట, ఆకలి వేయకపోవడం ఇలా అన్ని సమస్యలు మన నెత్తిపైనే ఉన్నట్టు అనిపిస్తుంది.
అందుకే జ్వరం అంటేనే అమ్మో అంటారు అందరు.ఇక జ్వరం వచ్చినప్పుడు సరైన ఆహారం తీసుకోవాలి.
అప్పుడే త్వరగా జ్వరాన్ని తరిమి కొట్టవచ్చు.అయితే జ్వరం సమయంలో చెరుకు రసం తాగితే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎందుకంటే, జ్వరానికి గురైనప్పుడు నీరసంగా మారిపోతుంటారు.ఆ సమయంలో మళ్లీ యాక్టివ్‌గా మారాలంటే ప్రోటీన్స్ చాలా అవసరం.
అయితే చెరుకు రసం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, మినరల్స్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా అందుతాయి.అలాగే జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలంటే రోగ నిరోధక శక్తి బలపడాలి.
చెరుకు రసం తాగడం వల్ల అందులో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ బి2 ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి గ్రేట్‌గా సహాయపడతాయి.ఇక సాధారనంగా జ్వరం వచ్చిందంటే.జలుబు, దగ్గు సమస్యలు కూడా చుట్టేస్తుంటాయి.అయితే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చెరుకు రసం తాగడం వల్ల జలుబు, జ్వరం మరియు గొంతు నొప్పి వంటి సమస్యలు త్వరగా నయం అవుతాయి.
ఇక చెరుకు రసంతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రోజుకో గ్లాస్ చెరుకు రసం తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు.చెరుకు రసం సేవించడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ మరియు మలబద్ధకం సమస్యలు దూరం అవుతాయి.ఇక నేటి కాలంలో చాలా మంది పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే రెగ్యులర్‌గా ఓ గ్లాస్ చెరుకు రసం తాగితే.పొట్ట చుట్టు కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.