బంగాళ‌దుంప‌తో మ‌చ్చ‌ల్లేని మెరిసే చ‌ర్మం సొంతం చేసుకోండిలా!!

బంగాళదుంప లేదా ఆలుగడ్డ.పేరు ఏదైనా ఓషధ‌‌‌గుణాలు మాత్రం ఒక్క‌టే.

 How Can Use Potato For Face..?, Potato, Potato Face Packs, Latest News, Beauty T-TeluguStop.com

బంగాళ దుంపలలో మ‌న శ‌రీరానికి కావాల్సిన‌ విటమిన్‌లు, ఖనిజ లవణాలు పుష్క‌లంగా ఉన్నాయి.ఇక ముఖ్యంగా మ‌న భార‌తీయులు బంగాళ‌దుంప‌తో అనేక ర‌కాల వంట‌లు త‌యారు చేస్తారు.

ఎలా చేసినా బంగాళ‌దుంప రుచి అద్భుత‌మ‌నే చెప్పాలి.అయితే ఆలుగ‌డ్డ తినేందుకు రుచిగా ఉండటమే కాదు.

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరిపించ‌డంలోనూ గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.

మ‌రి ఆలుగ‌డ్డ‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఆలుగ‌డ్డను ఉడికించి.తొక్క తీసేయాలి.

అనంత‌రం దాన్ని పేస్ట్ చేసుకుని.అందులో కొత్తి ప‌సుపు, నిమ్మ‌ర‌సం వేసి మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.పావు గంట త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.

Telugu Tips, Tips Potato, Dark Circles, Latest, Oily Skin, Pimples, Potato, Pota

చర్మంపై ఉన్న జిడ్డుని కూడా పీల్చుకుని.తాజాగా మారుస్తుంది.అలాగే బంగాళ‌దుంపును మిక్సీ ప‌ట్టి ర‌సాన్ని తీసుకోవాలి.

ఆ ర‌సంలో కొద్దిగా శెన‌గ‌పిండి, పెరుగు క‌లిపి ముఖానికి ప‌ట్టించి.పావు గంట త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది.మ‌రియు ముఖంపై మృత క‌ణాల‌ను తొలిగిస్తుంది.

ఇక బంగాళాదుంపని మిక్సీ ప‌ట్టుకుని పేస్టులా చేసుకోవాలి.ఆ మిశ్ర‌మ‌లో తేనె క‌లిపి ముఖానికి ప‌ట్టించి అరగంట తర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లే చేస్తే.ముడతలు పోయేలా చేస్తుంది.

మ‌రియు చక్కని ఛాయ తీసుకువ‌స్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube