ఉసిరి దీపాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే.. ఏం అవుతుందో తెలుసా?

డబ్బు జగతికి మూలాధారం.అలాంటి డబ్బును పొందాలంటే , ఎంతగా శ్రమించిన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మన మీద ఉండాలి.

 Benefits Of Pooja, God Lakshmi Devi, Usiri Deepam, Hindu Believes-TeluguStop.com

అయితే ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించడం ద్వారా అమ్మ అనుగ్రహం కలిగి మనం చేసేటువంటి పనులలో విజయం కల్పించడం వల్ల ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు.శుక్రవారం లక్ష్మీదేవికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పూజను నిర్వహిస్తారు.

కానీ ఉసిరికాయలతో దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా…

శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు.అలాంటి శుక్రవారం రోజున విశేష పూజలు అందుకుని తన భక్తుల పట్ల శాంతి స్వభావాన్ని కలిగి ఉంటుంది.

అంతేకాకుండా శుక్రవారం అమ్మవారికి ఉసిరికాయలతో దీపారాధన చేయటం ఎంతో ప్రీతికరం.ప్రతి శుక్రవారం సాయంత్రం ఉసరి కాయలతో దీపారాధన, ఉసిరికాయల హారతిని ఇవ్వడం ద్వారా ఆ అమ్మ అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, ఆయురారోగ్యాలతో ఉంటారు.

లక్ష్మీదేవిని పూజించిన తరువాత శ్రీ శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రాన్ని పఠించన తర్వాత ఉసిరికాయ తో చేసిన బొబ్బట్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.అంతేకాకుండా ఉసిరికాయ దీపం తో ఇంట్లో మంగళ హారతి ఇవ్వడం ద్వారా మన ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణం తొలిగిపోయి, సుఖ సంతోషాలతో గడుపుతారు.

కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా అష్టదరిద్రాలు తొలగిపోతాయి.హోమం నిర్వహించేటప్పుడు ఉసిరికాయను హోమానికి పూర్ణాహుతి గా సమర్పించడం ద్వారా మనం చేసేటటువంటి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి.

ఉసరి కాయపై నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే ఎంతో ప్రీతికరం.

అందుకోసమే భక్తులు శుక్రవారం అమ్మవారికి పూజ చేయటం వల్ల శుభం జరుగుతుంది.శుక్రవారం పూజ చేసే మహిళలు నుదిటిన ఎర్రటి సింధూరం తప్పకుండా పెట్టుకోవాలి.

అలా పెట్టుకోవడం వల్ల దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కలుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube