పెడిక్యూర్.చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు.
ఎవరో కొందరు మాత్రమే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఇరవై రోజులకు ఒకసారో లేదా నెలకొక సారో పెడిక్యూర్ చేయించుకుంటారు.కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు.
పైగా వారానికి ఒక సారి పెడిక్యూర్ చేసుకోవడం వల్ల బోలెడన్ని లాభాలను పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి.? అసలు పెడిక్యూర్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కాలి గోళ్లకు ఏమైనా నెయిల్ పాలిష్ ఉంటే తొలగించి.గోళ్లను సమానంగా కత్తిరించుకోవాలి.ఇప్పుడు ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో రెండు స్పూన్ల ఉప్పు, ఐదారు స్పూన్ల నిమ్మ రసం, రెగ్యులర్ షాంపూ, రెండు చుక్కలు లావెండర్ ఆయిల్ వేసి బాగా కలిపి.పాదాలను ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు నాన బెట్టు కోవాలి.

ఆ తర్వాత బియ్యం పిండిలో కొద్దిగా టీ పొడి కలిపి.పాదాలకు పట్టించి ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.స్క్రబ్బింగ్ వల్ల మురికి, మృతకణాలు తొలగిపోతాయి.అనంతరం బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌ను పాదాలకు అప్లై చేసి పావు గంట పాటు మసాజ్ చేసుకుని.వాటర్‌తో శుభ్ర పరుచుకుంటే పెడిక్యూర్ పూర్తైనట్టే.
ఇక వారానికి ఒక సారి పెడిక్యూర్ చేసుకోవడం వల్ల పాదాలు అందంగా, తెల్లగా, మృదువుగా మారడమే కాదు.
అనేక రకాల ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. పాదాల పగుళ్ల సమస్యకు దూరంగా ఉండొచ్చు.
పాదాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి.ఎటు వంటి నొప్పులు తలెత్తకుండా ఉంటాయి.
మరియు పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గు ముఖం పట్టి మనస్సు ఉత్సాహంగా మారుతుంది.