గడ్డం గీసేయొద్దు .. ఎందుకంటే!  

Benefits Of Not Shaving Your Beard-

మగవారికి దేవుడిచ్చిన వరం లాంటిది గడ్డం.ఎందుకంటే ముఖంలో అవకతవకలు ఉన్నా, ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా గడ్డంతో కప్పివేయవచ్చు.అలాంటి ఆప్షన్ అమ్మాయిలకి లేదుగా.అలాగని అబ్బాయిలందరికి పెద్ద సైజులో గడ్డం వస్తుందని కాదు.కొందరు మగవారికి జీన్స్ వలన గడ్డం పెరగదు.అవి పక్కనపెడితే గడ్డం రాయాలటీకి సింబల్ గా చెబుతారు.కొన్ని మాతాల్లోనైతే గడ్డం పెంచాలన్నా రూల్ కూడా ఉంది.ఇప్పుడు గడ్డం పెంచడం ఓ ట్రెండ్ కూడా.మరి గడ్డం ఎందుకు పెంచాలో, ఎందుకు గీయకూడదో చూడండి.

Benefits Of Not Shaving Your Beard--Benefits Of Not Shaving Your Beard-

* మన చర్మంపై యూవీ రేస్ గట్టి ప్రభావం చూపుతాయి.ఇవి స్కిన్ సెల్స్ ని డ్యామేజ్ చేయొచ్చు.అలాగే ట్యాన్ చేయొచ్చు.గడ్డం యూవీ రేస్ నుంచి ముఖంలోని కొంతభాగాన్ని కాపాడుతుంది.* గడ్డం అలానే ఉంచడం వలన కప్పబడిన చర్మం మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది.డ్రైగా మారదు.ఆ ప్రాంతంలో గాలి తగులుతుంది కూడా.* ముఖంపై మొటిమలు ఉన్నా, మరకలు ఉన్నా, ముడతలు ఉన్నా, అన్నీటిని కనబడకుండా కప్పివేస్తుంది గడ్డం.

* ఎయిర్ బోన్ బ్యాక్టీరియా చర్మంపై వాలకుండా కాపాడుతుంది గడ్డం.అలాగే ముక్కులోకి బ్యాక్టీరియా వెళ్ళకుండా అడ్డుకుంటుంది.* సగటున గడ్డం పెరిగే ఓ మగవాడు 3350 గంటలు గడ్డం గీసుకోవడంపై వెచ్చిస్తాడట.గడ్డం గీయకపోతే జీవితంలో ఎంత సమయం ఆదా అవుతుందో.* మొటిమలు ఉన్న మగవారైతే గడ్డం గీయకపోతేనే మంచిది.దీనివలన రెండు లాభాలు.ఒకటి గడ్డం వలన మొటిమలు కనబడవు.రెండొవది షేవ్ చేసేటప్పుడు గాయం వలన వచ్చే ఇంఫెక్షన్స్ బెడద ఉండదు.