ధ్యానం చేస్తే అవగాహన పెరుగుతుందా ?  

  • నిశ్శబ్దంగా కూర్చుని ఎటువంటి ఆలోచనలు లేకుండా ధ్యానం చేయాలి. కానీ ధ్యానం చేసేటప్పుడు ప్రారంభంలో ఆలోచనలు లేకుండా చేయటం సాధ్యం కాదు. అయితే సాధన చేయటం ద్వారా మనస్సును ధ్యానం మీద లగ్నం చేయవచ్చు. ఇప్పుడు ఆ దశల గురించి తెలుసుకుందాం.

  • రిలాక్సింగ్ మెళుకువలు

  • ప్రారంభంలో శరీరం, శ్వాస,ఆలోచనల మీద దృష్టి పెట్టాలి.

  • మంత్రాన్ని జపించటం

  • రెండో దశలో మనకు నచ్చిన మంత్రాన్నిజపిస్తూ ఉండాలి. ఓం నమః శివాయ వంటి అనేక ప్రసిద్ధి చెందిన మంత్రాలు ఉన్నాయి. ఈ విధంగా మంత్రం జపించటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మంత్రం జపించటం వలన ఎటువంటి ఆలోచనలు మరియు పరధ్యానం లేకుండా ఏకాగ్రత కుదురుతుంది. అంతేకాక ప్రతికూల ఆలోచనలు తగ్గి, ఏదైనా నిర్ణయం తీసుకొనేటప్పుడు అవగాహన పెరుగుతుంది. మంత్రాన్ని జపించటం వలన మంత్రం రిపీట్ అవుతూ నిశ్శబ్దం స్థానంలో మంత్రం భర్తీ అవుతుంది. దాంతో ఆలోచనలు కూడా తగ్గి ధ్యానం మీద దృష్టి కలుగుతుంది.

  • Benefits Of Meditation-

    Benefits Of Meditation

  • గాయము, కోపం, బాధ, అసూయ మరియు అనేక రకాల ఒత్తిడిలు తొలగిపోతాయి. జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చిన మన అనుభూతులు మన అవగాహన మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల ధ్యానం చేస్తే ఒక మంచి అవగాహన వస్తుంది. అలాగే అనవసరమైన భావనలు కూడా తగ్గుతాయి. అంతేకాక పరిస్థితిని అర్ధం చేసుకోవటంలో కూడా మంచి మార్పు వస్తుంది.