టెక్నాలజీ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మీ డబ్బులు డబుల్.. పూర్తి వివరాలివే!

Benefits Of Investing In Technology Funds Here Are The Full Details

నష్టభయం లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా పెట్టుబడిదారులకు చక్కటి రాబడి అందించడంలో మ్యూచువల్ ఫండ్స్ పై వరుసలో ఉంటాయి.అయితే వీటిలో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి.

 Benefits Of Investing In Technology Funds Here Are The Full Details-TeluguStop.com

పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు తమకు తగిన మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అలాగే ఇవి కాస్త రిస్క్ తో కూడుకున్నవి కాబట్టి ఆర్థిక సలహాదారుల అడ్వైస్ తీసుకోవడం తప్పనిసరి.

అయితే గత మూడు, నాలుగు సంవత్సరాలుగా టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు 100 శాతం రాబడిని అందిస్తున్నాయి.ఇవి గతేడాదిలో 95 శాతం, మూడేళ్ళ కాలంలో 45 శాతం, ఐదేళ్లలో 35 శాతం వరకు రాబడిని పెట్టుబడిదారులకు అందించాయి.

 Benefits Of Investing In Technology Funds Here Are The Full Details-టెక్నాలజీ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మీ డబ్బులు డబుల్.. పూర్తి వివరాలివే-Business - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ స్థాయిలో పెట్టుబడిదారుల పై కనక వర్షం కురిపిస్తున్న టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఏడాది క్రితం ఎస్‌బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి ఇప్పుడు రూ.1.82 లక్షలుగా మారింది.అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే 82 వేల రూపాయల లాభం లభించింది.

ఎస్‌ఐపీ స్కీమ్‌లో కూడా అధిక రాబడి లభించింది.ఇందులో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.మీకు ఈరోజు రూ.2.65 లక్షలు వచ్చేవి.ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ కూడా 95 శాతం రిటర్న్స్ అందించింది.టాటా మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా కూడా దాదాపు పెట్టుబడిదారుల డబ్బును డబుల్ చేశాయి.

Telugu Aditya Birla, Double Amount, Icici, Invest, Funds, Latest, Mutual Funds-General-Telugu

గత 20 సంవత్సరాలలో టెక్నాలజీ ఫండ్స్ అనేవి మంచి రాబడిని అందించాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.అయితే ఏ ఫండ్ ను ఎంచుకోవాలి అనే విషయం పూర్తిగా పెట్టుబడిదారులే నిర్ణయించుకోవాలి.ఇందుకు పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్, టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి.ప్రస్తుతం టెక్నాలజీ రంగం శరవేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచిగా పర్ఫామెన్స్ చేస్తున్నాయి.

#Funds #Invest #Mutual Funds #Funds #Double Amount

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube