నేటి ఆధునిక కాలంలో దాదాపు అందరూ ఏదో ఒక జుట్టు సంబంధిత సమస్యతో బాధ పడుతూనే ఉంటారు.జుట్టు రాలిపోవడం, జుట్టు చిట్లపోవడం, తెల్ల జుట్టు, కేశాలు డ్రైగా మారిపోవడం, చుండ్రు.
ఇలా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.అయితే అటు వంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టడంలో హాట్ ఆయిల్ మసాజ్ అద్భుతంగా సహాయపడుతుంది.
అవును, హాట్ ఆయిల్‌తో హెయిర్ మసాజ్ చేసుకుంటే మస్తు బెనిఫిట్స్ పొందొచ్చు.మరి లేటెందుకు ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ఒక బౌల్‌లో కొబ్బరి నూనె లేదా బాదం నూనె వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు హీట్ చేయాలి.ఇప్పుడు ఈ నూనెను గోరు వెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని చేతి వేళ్ళతో చక్కగా పది నుంచి పదిహేను నిమిషాల మసాజ్ చేసుకోవాలి.ఇలా వారంలో కనీసం రెండు సార్లు చేసుకుంటే.తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
తద్వారా కేశాలు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి.
అలాగే వేడి నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు పొట్లి పోవడం తగ్గుతుంది.
చుండ్రు సమస్య పరార్ అవుతుంది.అంతేనా.
ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి.హాట్ ఆయిల్‌తో తరచూ హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు పొడి బారడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
అదే సమయంలో కురులు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.మరియు కేశాలు ఎప్పుడూ షైనీగా మెరిసి పోతుంటాయి.
అంతేకాదు, హాట్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, తల నొప్పి వంటి మానసిక సమస్యలు తగ్గు ముఖం పట్టి.మనసు ప్రశాంతంగా మారి పోతుంది.అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.హాట్ ఆయిల్ అన్నారు కదా అని వేడి వేడిగా ఉన్న నూనెను వాడితే ఖచ్చితంగా తిప్పలు పడతారు.కాబట్టి, గోరు వెచ్చగా అయిన తర్వాతే నూనెను వాడండి.