మెంతులు మహిళలకు ఎంత సాయం చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు     2018-06-30   23:05:46  IST  Lakshmi P

మన భారతీయులు పురాతన కాలం నుండి మెంతులను ఉపయోగిస్తున్నారు. మెంతుల్లో ఉండే లక్షణాలు,పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. మెంతులను కూరల్లో వేసినప్పుడు మంచి వాసన రుచి వస్తాయి. మెంతులను సరైన మోతాదులో సరైన క్రమంలో తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మన దేశంలో పురాతన కాలం నుండి మెంతులతో తయారుచేసిన ఆహారాన్ని బాలింతలకు పెట్టటం జరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మెంతులను తింటే బాలింతలో పాలు బాగా పడతాయి. మెంతులను నేతిలో వేగించి పొడి చేయాలి. మెంతుల పరిమాణంలోనే గోధుమపిండిని తీసుకోని మెంతుల పొడి వేసి పంచదారతో హాల్వా తయారుచేసుకోవాలి. ఈ హాల్వా ను ని ప్రతి రోజు తినాలి. ఇది బాలింతకు బాగా పనిచేస్తుంది.