సీజనల్ పండ్లే ఎందుకు తినాలంటే ...

చాలారకాల పండ్లు ఆయా సీజన్లోనే దొరుకుతాయి.ఏ వాతావరణంలో ఎలాంటి పండు మన శరీరానికి కావాలో ప్రకృతికి తెలుసు కాబట్టే, సీజన్ కో పండు మనకి అందిస్తుంది.

 Why Should We Prefer Only Seasonal Fruits-TeluguStop.com

రుచికి పడిపోయి, సీజన్ కాని టైమ్ లో కూడా ఇష్టమైన పండ్లని తినడానికి ప్రయత్నిస్తుంటారు.అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఏ సీజన్ కి సంబంధిచించిన పండ్లు ఆ సీజన్ లోనే తినడం ఉత్తమం.ఎందుకంటే …

* మామిడిపండ్లు పండడానికి వేసవే సరైన కాలం.

అప్పుడైతే సహజంగా పండుతాయి.అలా కాకుండా కృత్రిమ పద్ధతిలో పండిస్తే, దొరకాల్సిన పోషకాలు దొరకవు.

ఏ పండైనా అంతే.అందుకే సీజనల్ ఫ్రూట్స్ తినాలి.

* కృతిమ పద్ధతుల్లో పండిచినప్పుడు పండ్లలోని సహజమైన రుచి తగ్గిపోతుంది.కాబట్టి అన్-సీజన్ పండ్లని దూరం పెట్టడమే మంచిది.

* సీజన్ లో సులభంగా దొరికేవాటి ధర తక్కువ ఉంటుంది.కష్టంగా దొరికేవాటి ధర ఎక్కువగా ఉంటుంది.

అందుకే అన్-సీజన్ పండ్లను కృతిమంగా పండించి ఎక్కువ రేట్లకి అమ్ముతారు.

* ఎంత ఇష్టమైన పండైనా సరే, ఏడాదంతా తింటే బోర్ కొడుతుంది.

వేరు వేరు సీజన్స్ వేరు వేరు పండ్లు తినాలి కాబట్టే మనకి సీజన్ మారినాకొద్ది కొత్త కొత్త పండ్లు దొరుకుతాయి.ఇది ప్రకృతి నియమం.

దాన్ని దాటడం మనకే మంచిది కాదు.

* అన్ సీజన్ పండ్లను ఎక్కడినుంచో తీసుకురావాల్సి వస్తుంది.

ప్రయాణాల్లో పండ్లు చాలా చేతులు మారతాయి.వాతావరణ మార్పుకి కూడా గురవుతాయి.

కాబట్టి సీజన్ పండ్లపై మాత్రమే ధ్యాస పెట్టండి.

* సీజనల్ పండ్లని కెమికల్స్ వాడి, టెంపరేచర్ లో మార్పులు చేసి పండిచాల్సిన పని ఉండదు.

సహజమైన ఉష్ణోగ్రతలో, సహజమైన వాతావరణంలో, సహజమైన పద్ధతిలో పండుతాయి కాబట్టి సీజనల్ పండ్లు అన్నిరకాలుగా మంచివి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube