ప్రస్తుత కాలంలో ప్రజలు తిండి, నిద్ర మరిచిపోయి డబ్బే పరమావధిగా జీవిస్తున్నారు.సరైన సమయానికి తిండి తినడం కూడా మరిచిపోతున్నారు.
కొందరు అల్పాహారం మానేసి లంచ్ మాత్రమే చేస్తుంటే మరికొందరు రాత్రి పది గంటల తరువాత డిన్నర చేస్తున్నారు.అయితే వైద్యులు, వైద్య నిపుణులు ఇలాంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.
రాత్రి ఏ సమయంలో భోజనం తీసుకుంటున్నామో… ఎంత సమయం నిద్ర పోతున్నామో అనే అంశాలపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.ఏ కారణం చేతనైనా సమయానికి రాత్రిపూట భోజనం తీసుకోకప్పోయినా… ఆలస్యంగా తీసుకున్నా… రోజూ ఒకే పరిమాణంలో తీసుకోకపోయినా ప్రమాదకరమని చెబుతున్నారు.
టైమ్ కు తిని సమయానికి అనుకూలంగా నిద్రపోతే మంచిదని తెలుపుతున్నారు.

సమయానికి తిని మంచిగా నిద్రపోవడం వల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు తగ్గుతాయని తెలుపుతున్నారు.రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయని… భోజనం చేయని వాళ్లు అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.రాత్రి త్వరగా తక్కువ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలని తెలుపుతున్నారు.త్వరగా తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని… తిన్న ఆహారమంతా జీర్ణమవుతుందని… అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత నిద్రపోవాలని… కనీసం ఏడు గంటలు నిద్ర పోయేలా ప్లాన్ చేసుకోవాలని తెలుపుతున్నారు.
రాత్రి త్వరగా తక్కువ సమయంలోనే బరువు తగ్గే అవకాశం ఉందని… అధిక బరువు, అధిక కొవ్వు సమస్యలతో బాధ పడే వాళ్లకు ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయని సూచిస్తున్నారు.తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు లేవాలని రాత్రి త్వరగా పడుకోవాలని తెలుపుతున్నారు.