అరటి ఆకులో తింటే ఆరోగ్యం.. తామరాకులో తింటే...?

మన పెద్దవారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు.అలాంటి అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మంచి జరుగుతుందని మన పండితులు అంటున్నారు.

 Benefits Of Eating Food On Leaves-TeluguStop.com

అయితే అన్నం ఏ ఆకులో తింటే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం.

అరటి ఆకులో భోజనం చేయటం వలన ఆకలి పెరుగుతుంది.

తామరాకులో భోజనం చేసేవారు ఐశ్వర్యవంతులు అవుతారు.సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది.

బాదం ఆకులో భోజనం చేసేవారు కఠిన హృదయం కలవారిగా మారతారు.

టేకు ఆకులో భోజనం చేసే వారికి భవిష్యత్తు, వర్తమానాల గురించి తెలుసుకునే జ్ఞానం వస్తుంది.

అన్నం తినటానికి కూర్చున్న తర్వాతే విస్తరిలో అన్ని వడ్డించాలి.అంతేకాని అన్ని వడ్డించిన విస్తరి ముందు కూర్చోకూడదు.ఆలా చేస్తే రాబోయే రోజుల్లో దరిద్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తూర్పునకు అభిముఖంగా భోజనం చేస్తే దీర్గాయుష్షు లభిస్తుంది.

పశ్చిమాభి ముఖంగా కూర్చొని భోజనం చేస్తే బలం, ఉత్తరాభి ముఖంగా కూర్చుంటే సంపదలు, దక్షిణాభి ముఖంగా కూర్చుంటే కీర్తి లభిస్తాయి.

భోజనం చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా తినాలి.

వండిన వారిని దుర్భాషలాడటం వంటివి చేయకూడదు.అలాగే కంచాన్ని ఒడిలో పెట్టుకొని తినకూడదు.

ఒకవేళ ఆలా తింటే దరిద్రం చుట్టుకుంటుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు