ఆకాకర.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

గుండ్రంగా ఆకుపచ్చని రంగుతో ఉండే ఆకాకరను బోడ కాకర అని కూడా పిలుస్తారు.ఏవి ఎక్కువగా అడవుల్లో పెరుగుతాయి.

 Benefits Of Eating Boda Kakarakaya-TeluguStop.com

అందువల్ల వీటి డిమాండ్ కూడా ఎక్కువే.ఆకాకర ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆకాకరలో పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి.వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 కేలరీలు మాత్రమే ఉంటాయి.

ఆకాకరలో పీచు ఎక్కువగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది

దీనిలో ఉండే ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి.ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి.

మాములు కాకర మధుమేహానికి ఎలా పనిచేస్తుందో ఆకాకర కూడా అలానే పనిచేస్తుంది.రక్తంలో చక్కర స్థాయిలను క్రమబద్దీకరణ చేయటంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

ఆకాకర వర్షాకాలంలో బాగా లభిస్తాయి.వర్షాకాలంలో వచ్చే జలుబు,దగ్గు వంటివి ఆకాకర తినటం వలన తగ్గిపోతాయి

ఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలో సహాయపడతాయి.

విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.వీటిలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.

బోడ కాకర కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది.వీటిని తరచుగా తినడం వల్ల చర్మ సమస్యలు రావు.

వీటిని వండేటప్పుడు పైనున్న బొడిపెలను తీసేయకుండా వండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube