ఘాటైన రుచి, వాసన కలిగే అల్లంను వంటల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.ముఖ్యంగా నాన్ వెజ్ వంటల్లో అల్లం ఖచ్చితంగా పడాల్సిందే.
లేదంటే ఏదో వెలితిగానే ఉంటుంది.వంటలకు మంచి రుచిని ఇచ్చే అల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి.
అందుకే అల్లం తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.అయితే అల్లం తీసుకోవడమే కాదు తీసుకునే సమయం బట్టీ కూడా ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.
ముఖ్యంగా పరగడుపున అల్లం తీసుకుంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా కొందరి శరీరం నీరు పడుతుంటుంది.దాంతో శరీరం ఉబ్బి నట్టు కనిపిస్తుంది.
అయితే పరగడుపున చిన్న అల్లం ముక్క లేదా అల్లం రసం తీసుకుంటే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటికి వెళ్లిపోతుంది.మరియు మార్కింగ్ టైమ్‌లో ఉండే నీరసం, అలసట, వికారం వంటి సమస్యలు దూరం అవుతాయి.

అలాగే కడుపు అల్సర్‌తో బాధ పడే వారు పరగడుపున అల్లం ముక్కను తేనెతో కలిపి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే అల్సర్ సమస్య క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమై జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.కీళ్ల నొప్పులు, వాపులతో తంటాలు పడే వారు ప్రతి రోజు ఉదయాన్నే అల్లం ముక్క తీసుకోవాలి.
తద్వారా కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందుతారు.
పరగడుపున అల్లం ముక్క లేదా అలం రసం తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య ఉండదు.
అలాగే అల్లంను ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.ఇక అల్లం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు దూరం అవుతాయి.