కలబంద రసం రోజూ ఎందుకు తాగాలి ?     2017-01-05   03:21:04  IST  Lakshmi P

కలబందని సర్వరోగనివారిణి అని అంటారని మనకు తెలుసు. కలబంద(Aloe Vera) శరీరంలో పడాలని బామ్మో, తాతయ్యో చెబుతోంటే ఎన్నోసార్లు విన్నాం. కలబంద జెల్లిలాగా ఉండటం వలన తినడానికి ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అలాంటప్పుడు జ్యూస్ చేసుకొని తాగితే బెటర్. చేదుగా అనిపిస్తే, తగినంత తేనే కలుపుకుంటే మంచిది. మరి కలబంద(Aloe Vera) జ్యూస్ రోజూ ఎందుకు తాగాలి అని మీకు అనుమానం రావచ్చు.

* ఒంట్లో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్టరాల్ ని కడిగివేయటానికి కలబంద(Aloe Vera) మెరుగ్గా పనిచేస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. గుడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని పెంచుతుంది.

* మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడేవారికి కలబంద మంచి ఉపశమనం. లక్సేటివ్ ప్రాపర్టీస్ ఉండటం వలన, ఇది జీర్ణక్రియను సుఖవంతం చేస్తుంది.

* హై బ్లడ్ షుగర్ లెవెల్స్ తో ఇబ్బందిపడేవారికి కలబంద మంచి పరిష్కార మార్గం. రోజు, మరచిపోకుండా కలబంద జ్యూస్ తాగుతూ ఉంటే డయాబెటిస్ ని కంట్రోల్ లో పెట్టవచ్చు.

* బోవేల్ మూమెంట్స్ ని ఇబ్బందిలేకుండా చేయడం కలబంద రసం స్పెషాలిటి. అన్నిరకాల జీర్ణ సమస్యలకి ఇది పనికివస్తుంది.

* చాతిలో మంట లేదంటే సైనస్ లాంటి సమస్య ఉన్నా సరే, మీరోజుని కలబంద జ్యూస్ తో హాయిగా మార్చుకోండి.