బ్లాక్ రైస్ బెనిఫిట్స్ తెలిస్తే మీరు బ్లాంక్ అవ్వడం ఖాయం..!

ఆసియా ఖండంలోని ప్రజల ప్రధాన ఆహారం బియ్యం.అలాగే ఈ బియ్యంలో కూడా చాలా రకాలు ఉన్నాయి.

 Benefits Of Black Rice Black Rice, Latest News, Health Care, Health Tips, Health-TeluguStop.com

వాటిలో ప్రధానమైనవి వైట్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్.ఎక్కువమంది ప్రజలు తెల్ల బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.

అయితే బ్లాక్ రైస్ గురించి చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది.ఎందుకంటే బ్లాక్ రైస్ అతిపురాతన బియ్యం.

వీటిని పూర్వకాలంలో ఈశాన్య భారతంలో ఎక్కువగా సాగు చేసేవారు.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నల్లబియ్యాన్ని ఎక్కువగా రాజులు మాత్రమే తినడానికి పండించేవారట.

కాలంతో పాటు ఈ బ్లాక్ రైస్ ను సాగు చేస్తున్న వారు కూడా చాలా తక్కువ మంది అయిపోయారు.నిజానికి ఈ నల్ల బియ్యం తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రస్తుత కాలంలో ఈ నల్లబియ్యాన్ని ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌ లతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా సాగు చేస్తున్నారు.మరి ఈ నల్ల బియ్యం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామా.

నల్లబియ్యంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.అలాగే వీటిలో ఎన్నో రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి.

బ్లాక్ రైస్ తినడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.వీటిలో ఆంథోసైనిన్స్ అధికంగా ఉండడం వలన అవి హానికర బ్యాక్టీరియాలను, వైరస్ లను శరీరంలోకి చేరకుండా చేస్తాయి.

అలాగే ఈ బ్లాక్ రైస్ లో విటమిన్ బి, ఇ లతో పాటుగా నియాసిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉన్నాయని చాలా రకాల పరిశోధనలలో తేలింది.అంతేకాకుండా ఈ బియ్యంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

బరువు తగ్గాలని భావించేవారు బ్లాక్ రైస్ ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.అలాగే ఈ నల్లబియ్యం మధుమేహాన్ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.

Telugu Black, Care, Tips, Healthy Foods, Latest-Latest News - Telugu

బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి.అది ఏంటంటే.ఈ నల్లబియ్యం రుచి కూడా చాలా బాగుంటుందట.ఈ బియ్యాన్ని అన్నం వండుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది అందుకే తీపి వంటలు చేసేటప్పుడు నల్ల బియ్యాన్ని విరివిగా ఉపయోగిస్తారు.నల్లబియ్యంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

గుండె అలాగే మెదడు సంబంధిత సమస్యలను మన దరిచేరనివ్వదు.బీపీ ఎక్కువగా ఉన్నవారికి ఈ బ్లాక్ రైస్ ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పాలి.

మరి ఈ బ్లాక్ రైస్ ధర విషయానికి వస్తే.బెంగళూరు సేంద్రియ దుకాణాల్లో నల్ల బియ్యం కిలో 200 రూపాయలుగా ఉంది.

మనకు దొరికే అన్ని రకాల బియ్యాల కంటే ఈ బ్లాక్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube