తమలపాకు పై దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలలో లేదా పూజా కార్యక్రమాలలో తమలపాకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాము.ఈ క్రమంలోనే తమలపాకులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తారు.

 Benefits Of Betel Lamp Lakshmi Devi Saraswati Devi Parvati Devi Details, Betel,-TeluguStop.com

మన శుభకార్యాలలో పూజ చేస్తున్న సమయంలో దీపారాధన చేస్తాము అయితే ఈ దీపారాధన కోసం వెలిగించే దీపాన్ని తమలపాకుపై పెట్టి వెలిగించడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

సాధారణంగా తమలపాకులలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారని భావిస్తారు.

తమలపాకుల కాడలో పార్వతీదేవి, ఆకు చివరలు లక్ష్మీదేవి, మధ్యభాగంలో సరస్వతీ దేవి కొలువై ఉంటారని చెబుతారు.అందుకే పూజ చేసే సమయంలో తమలపాకుపై దీపం వెలిగించడం వల్ల ఈ ముగ్గురి అమ్మల ఆశీర్వాదం మనపై కలుగుతుందని చెబుతారు.

ఈ క్రమంలోనే ఆరు తమలపాకులను తీసుకొని నెమలి పించం ఆకారంలో పెట్టి అందులో దీపం వెలిగించాలి.

ఇలా దీపం వెలిగించే సమయంలో ముందుగా ఆకు కాడలను తెంచి దీపంలో వేసిన అనంతరం నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి.ఇలా తమలపాకులో దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.అదే విధంగా సంపద వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఈ దీపాన్ని ప్రతిరోజు ఉదయం వెలిగించడం వల్ల ముగ్గురి అమ్మల అనుగ్రహం మనపై కలుగుతుందని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube