బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

బీట్‌రూట్‌అద్భుత‌మైన దుంపుల్లో ఇది ఒక‌టి.ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా బీట్‌రూట్ ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

 Benefits Of Beetroot Leaves For Hair! Benefits Of Beetroot Leaves, Hair, Beetroo-TeluguStop.com

అలాగే మ‌రెన్నో స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.అయితే బీట్‌రూట్ మాత్ర‌మే కాదు.

బీట్‌రూట్ ఆకులు కూడా మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌రిమి కొట్ట‌డంలో బీట్‌రూట్ ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం కేశాలకు బీట్‌రూట్ ఆకుల‌ను ఎలా ఉప‌యోగించాలి.? అస‌లు ఈ ఆకుల వ‌ల్ల ఏయే బెనిఫిట్స్‌ను పొందొచ్చు వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా కొన్ని బీట్‌రూట్ ఆకుల‌ను సేక‌రించి నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక క‌ప్పు వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే.అందులో క‌ట్ చేసి పెట్టుకున్న బీట్‌రూట్ ఆకులు వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్‌లో ఉడికించి పెట్టుకున్న బీట్‌రూట్ ఆకులు వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ గోరింటాకు పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ క‌రివేపాకు పొడి, నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూతో త‌ల స్నానం చేయాలి.

Telugu Beetroot, Care, Care Tips, Latest, Long-Telugu Health Tips

కొంద‌రికి జుట్టు ఊడుతుంది.కానీ, కొత్త వెంట్రుక‌లు రావు.దాంతో జుట్టు మొత్తం ప‌ల్చ‌బ‌డి.తోక‌లా త‌యారు అవుతుంది.అలాంటి వారు పైన చెప్పిన ప్యాక్‌ను వారంలో రెండు సార్లు ట్రై చేస్తే గ‌నుక‌ ఊడిన చోట జుట్టు మ‌ళ్లీ ఒత్తుగా వ‌స్తుంది.అలాగే కేశాలు త్వ‌ర‌గా తెల్ల బ‌డ‌కుండా ఉంటాయి.

ఒక‌వేళ తెల్ల జుట్టు ఉంటే న‌ల్ల‌గా మారుతుంది.మ‌రియు చుండ్రు స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube