యాపిల్, బీట్ రూట్, క్యారెట్.ఈ మూడింటి లోనూ ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో జబ్బులను సైతం నివారిస్తాయి.విడి విడిగా వీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య లాభాలు లిభిస్తాయని అందరికీ తెలుసు.కానీ, వీటిని కలిపి తీసుకుంటే అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అసలు ఇంతకీ యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ కలిపి ఎలా తీసుకోవాలి.? ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటీ.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పీల్ తీసి శుభ్రం చేసిన ఒక బీట్ రూట్‌ను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అపై క్యారెట్ మరియు యాపిల్‌ను కూడా కట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ ముక్కలతో పాటుగా చిన్న అల్లం ముక్క, సరిపడా నీళ్లు వేసి మెత్తగాగ్రాండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి.
ఈ జ్యూస్‌ను తీసుకుంటే గనుక ఆరోగ్యానికి బోలెడన్ని బెనిఫిట్స్ లభిస్తాయి.
ముఖ్యంగా ప్రతి రోజు ఉదయాన్నే ఈ జ్యూస్‌ను సేవిస్తే మెదడును చురుగ్గా మార్చుతుంది.మతి మరుపు దూరమై జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.అలాగే యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ లతో తయారు చేసిన జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
రక్త హీనత పరార్ అవుతుంది.చర్మం యవ్వనంగా, కాంతివంతంగా తయారవుతుంది.
హెయిర్ ఫాల్ నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ జ్యూస్ డిటాక్స్ డ్రింక్‌లా సైతం పని చేస్తుంది.
ఈ జ్యూస్ తాగితే టాక్సిన్స్ తొలిగిపోయి శరీరంలోని అంతర్గత అవయవాలు శుభ్రంగా మారతాయి.అంతేకాదు, రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్‌ను సేవించడం వల్ల ఒంట్లో అదనంగా పేరుకు పోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.మరియు కంటి చూపు కూడా పెరుగుతుంది.