48 రోజులపాటు బ్రహ్మ ముహూర్తంలో ఉసిరి దీపం వెలిగిస్తే..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా ప్రత్యేక రోజులలో, పండుగరోజులలో ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయంలో ఉసిరి దీపాలను వెలిగించడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయి? ఉసిరి దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అనే సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి.అయితే ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం….

 Amla,indian, Gooseberry, Lamp,maha Vishnuv,lakshmi Devi-TeluguStop.com

శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీ దేవతకు ఉసిరి అంటే ఎంతో ప్రీతికరం.

వీరి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఉసిరి దీపం వెలిగించాలి.అయితే అమ్మ వారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజున ఉసిరి దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.ఈ క్రమంలోనే బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు రెండు ఉసిరి దీపాలను వెలిగించడం ద్వారా మనం కోరుకున్న కోరికలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి.48 రోజులపాటు బ్రహ్మ ముహూర్తంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలను కలుగజేస్తుందని పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా 48 రోజులు బ్రహ్మ ముహూర్తంలో ఉసిరి పై నేతి దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో సర్వ శుభాలు కలుగుతాయని,శ్రీలక్ష్మీ, శ్రీపతి అనుగ్రహాన్ని పొందవచ్చు.తద్వారా ఈతిబాధలు వుండవు.

పూజ అనంతరం అమ్మవారికి అష్టోత్తరం చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఉసిరి దీపం వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరనీ ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube