అధిక బరువుకు చెక్ పెట్టాలంటే... కలబంద       2018-06-08   22:52:19  IST  Lakshmi P

కలబందను మన పూర్వీకుల కాలం నుండి ఆరోగ్యం,అందం ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తున్నారు. మన పెరటిలో ఉండే ఈ కలబందను ఉపయోగించి ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలను పొందవచ్చు. కలబంద మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. కలబంద ఇంటి పెరటిలో లేకపోతే మార్కెట్ లో జెల్ రూపంలో లభిస్తుంది. అది అయినా వాడవచ్చు. అయితే ఇంటిలో ఉండే కలబంద అయితే తాజాగా ఉంటుంది. కలబందను ఉపయోగించి బరువు ఎలా తగ్గాలా అని ఆలోచనలో పడ్డారా? అయితే ఈ ఆర్టికల్ చదవండి. మీకే అర్ధం అవుతుంది.

ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ కలబంద జ్యుస్, ఒక స్పూన్ అల్లం రసం వేసి బాగా కలిపి గోరువెచ్చగా చేయాలి. ఈ పానీయాన్ని ఉదయం పరగడుపున త్రాగాలి. ఈ పానీయం శరీరంలో కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దాంతో బరువు తొందరగా తగ్గుతారు.

ప్రతి రోజు గ్రీన్ టీ త్రాగుతూనే ఉంటాం. ఆ గ్రీన్ టీలో అరస్పూన్ కలబంద జ్యుస్ కలిపి త్రాగితే గ్రీన్ టీ వలన కలిగే ప్రయోజనాలు,కలబంద వలన కలిగే ప్రయోజనాలు రెండు శరీరానికి అందుతాయి. ఈ రెండు ప్రయోజనాలు కలిసి బరువు తగ్గించటంలో సహాయపడతాయి.

ప్రతి రోజు ఉదయం,సాయంత్రం కలబంద జ్యుస్ తీసుకుంటే బరువు తగ్గుతారు. అయితే క్రమం తప్పకుండా తీసుకుంటే నెలలో దాదాపుగా 5 కేజీల బరువు తగ్గటం ఖాయం.