వాము.ఆరోగ్యానికి ఎంతమంచి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మనకు అజీర్తి చేసిన.దగ్గూ వచ్చిన.ఆస్తమా వచ్చిన.బ్రాంకైటిస్, జ్వరం లాంటివి ఏవి వచ్చిన ఈ వాము కాస్త తీసుకుంటే చాలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.
జీర్ణ, శ్వాసకోశ, మూత్రాశయ, రక్తప్రసరణ వ్యవస్థలకు సంబంధించిన వ్యాధులు అన్నింటిని వాము సమర్థంగా నివారిస్తుందట.
ఇంకా ఈ విషయాన్నే వైద్యులు కూడా చెప్తున్నారు.
వాము అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుందట.పొట్టలో పరాన్నజీవులుగా చేరే క్రిముల్ని కూడా వాము చక్కగా నిర్మూలిస్తుంది.
ఎందుకంటే ఈ వాములోని థైమల్, కార్వాక్రల్, థైమోక్వినాల్ వంటి ఘాటైన నూనెలు హానికర క్రిముల్నీ బ్యాక్టీరియానీ చంపేస్తాయి.
ఇంకా అంతేకాదు ఈ వాము జీర్ణశక్తినీ పెంచుతుంది.
గొంతులోని శ్లేష్మాన్నీ హరిస్తుంది, నరాల బలహీనతనీ తగ్గిస్తుంది.అందుకే ఆయుర్వేద నిపుణులు అరటీస్పూను వాముపొడిని గోరువెచ్చని నీటితో కలిపి రోజుకి రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే శరీరంలో ఉండే రోగాలు అన్ని మాయం అవుతాయి అని అంటున్నారు.
మరి ఇంకేందుకు ఆలస్యం గోరు వెచ్చని నీటిలో వాము కలిపి తీసుకోండి.ఆరోగ్యంగా ఉండండి.