పీఏగా పెట్టుకోమని సీఎంని కోరిన విద్యార్థి ..!

ఏపీ సీఎం జగన్ గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు.ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి విద్యార్థులను ప్రత్యేకంగా కలిశారు.

 Bendapudi Student Anudeep Conversation With Cm Jagan Details, Cm, Pa, Student,-TeluguStop.com

వారు అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటం చూసి ముఖ్యమంత్రి ఫిదా అయ్యారు.బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్దుల టాలెంట్ చూసి ఆ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించేకు ఆహ్వానించారు.

ఒక్కో విద్యార్థిని ప్రత్యేకంగా పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకున్న జగన్.వారి గురించి అడిగి తెలుసుకున్నారు.

సీఎంతో పాటు మంత్రులు, అధికారులు ఎదురుగా ఉన్నా విద్యార్థులు మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా ధైర్యంగా ఇంగ్లీష్ లో మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలు, స్కూళ్ల అభివృద్ధి వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఐదుగురు విద్యార్దులతో పాటు వారి ప్రతిభకు కారణమైన ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను సీఎం అభినందించారు.ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి సంభాషణ దాదాపుగా ఇంగ్లిష్‌లోనే కొనసాగింది.

ఈ ఐదుగురు విద్యార్థుల్లో ఒకడైన అనుదీప్ ముఖ్యమంత్రి జగన్‌తో సరదాగా మాట్లాడారు.ఇంగ్లీష్ లో అదరగొడుతూనే తాను పెద్దయ్యాక ఐఏఎస్ అవుతానని.

అప్పుడు మీ పీఏగా అవకాశం ఇస్తే.మీపై వచ్చే విమర్శలను తిప్పికొడాతనని ప్రామిస్ చేస్తున్నాని.

మీరు కూడా ప్రామిస్ చేయాలని కోరాడు.విమర్శకుల మాటలను పట్టించుకోవద్దని.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ను కొనసాగించమని అనుదీప్ కోరాడు.దీంతో సీఎంతో సహా అక్కడున్నవారంతూ నవ్వుకున్నారు.

Telugu Bendapudi, Bendapudi Jagan, English Medium, Schools, Latest-Latest News -

ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోగా.విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశముందని పలువురు కోర్టుకెళ్లిన సంగతి తెలిసింది.అయితే, బెండపూడిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో.

ఆయన విద్యార్థుల్ని తన క్యాంప్ ఆఫీసుకు ఆహ్వానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube