ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ జెర్సీపై భారత సంతతి వైద్యుడి పేరు: ఎందుకో తెలుసా..?

కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న త్యాగం వెలకట్టలేనిది.

బాధితులకు చికిత్స అందించే క్రమంలో ఇప్పటికే వందల మంది డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.

మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.వీరు చేస్తున్న సేవలపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సైతం కరోనా వారియర్స్‌కు తనదైన శైలిలో సెల్యూట్ చెప్పింది.

కరోనా కారణంగా మార్చి నెలలో క్రికెట్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సుమారు 117 రోజుల తర్వాత జెంటిల్మెన్ ఆటకు ఇంగ్లాండ్ మళ్లీ ప్రాణం పోసింది.

బయో‌సెక్యూర్ వాతావరణంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను ప్రారంభించింది.8వ తేదీ నుంచి సౌథాంప్టన్ వేదికగా తొలి టెస్ట్ ఆరంభమైంది.

ఈ క్రమంలో కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఇంగ్లాండ్ ప్లేయర్లు సెల్యూట్ చేశారు.

"""/"/ కెప్టెన్ బెన్‌స్టోక్స్ సహా క్రికెటర్లంతా.కోవిడ్ యోధుల పేర్లను తమ జెర్సీలపై ధరించారు.

ఇందులో భారత సంతతి వైద్యుడు డాక్టర్ వికాశ్ కుమార్ పేరు ఉన్న షర్ట్‌ను ప్రాక్టీస్ సమయంలో బెన్‌స్టోక్స్ ధరించాడు.

రైట్ ద బ్యాట్ టెస్ట్ సిరీస్ హ్యాష్‌ట్యాగ్‌తో ఇంగ్లాండ్ క్రికెటర్లు చైతన్యాన్ని తీసుకువస్తున్నారు.

కరోనా మహమ్మారిపై పోరులో పాల్గొంటున్న వారియర్స్‌కు గౌరవం ఇస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

వారి పేర్లతో ఉన్న జెర్సీలను ధరించడం.వారికి తామిచ్చే చిన్న సత్కారమని సారథి బెన్‌స్టోక్స్ తెలిపాడు.

తాము మళ్లీ స్వేచ్ఛగా క్రికెట్ ఆడుతున్నామంటే.అది వారి కృషి వల్లేనని ఆయన అన్నారు.

కాగా ఢిల్లీకి చెందిన డాక్టర్ వికాస్ కుమార్ 2019లో కుటుంబంతో సహా ఇంగ్లాండ్‌ వెళ్లారు.

అక్కడ డార్లింగ్టన్ మెమోరియల్ హాస్పిటల్‌లో అనస్థీషియా స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు.వికాస్‌తో పాటుగా భారత సంతతికి చెందిన మెడికల్ వర్కర్లు జమాస్ప్ కైఖుస్రూ దస్తూర్, హరికృష్ణ షా, క్రిషన్ అగాధల పేర్లతో ఉన్న జెర్సీలను ఇంగ్లాండ్ క్రికెటర్లు ధరించడం విశేషం.

సందీప్ రెడ్డి వంగా మాకు కావాలంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు…ఎవరంటే..?