హర్ష భోగ్లేకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బెన్ స్టోక్స్..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లలో అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి.ఉత్కంఠంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమే మ్యాచ్ ను గెలవాలని క్రికెటర్లు ఒకరి మీదికి ఒకరు వెళ్లడం, బ్యాటింగ్ ఆడుతున్న లేదా బౌలింగ్ చేస్తున్న ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది.

 Ben Stokes Hits Back At Harsha Bhogle Over culture Comment In Mankad Issue,ben S-TeluguStop.com

గత కొన్ని రోజుల క్రితం లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్ లో చార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ చేసిన తర్వాత దీప్తి శర్మపై ఇంగ్లీష్ మీడియా విష ప్రచారం చేయడాన్ని హర్షా భోగ్లే తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.

హర్షా భోగ్లే తీవ్రంగా ఖండించిన విషయంపై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ తీవ్రంగా ఖండిస్తూ ట్విట్ చేశాడు.

అయితే హర్ష ట్వీట్ల పట్ల ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు.ఇక హర్షా భోగ్లే ఇంగ్లాండ్ మీడియా అత్యుత్సాహాన్ని, సంస్కృతినీ ఘాటుగా విమర్శించాడు.

క్రికెట్ లో నాన్ స్ట్రైకర్‌ ఎండ్‌లో క్రీజులో నుంచి ముందే పరుగు తీసే సంస్కృతి ఆంగ్లేయులది అని ఎలా రాస్తావ్ అంటూ కాస్త ఘాటుగానే స్టోక్స్ పేర్కొన్నాడు.హర్షా మన్కడింగ్ విషయంలో ప్రజల అభిప్రాయాలు ఇలా ఉంటాయి అని సూటిగా చెప్పేస్తే పోయేదానికి ఇంగ్లాండ్ సంస్కృతి ఇలాంటిది అంటూ అసలు సంస్కృతిని ఎందుకు తీసుకురావాలి,అది సంస్కృతికి సంబంధించిన విషయం కాదు అంటూ స్టోక్స్ ట్వీట్లలో రిప్లే ఇచ్చాడు.అయితే 2019 వరల్డ్ ఫైనల్ ముగిసి ఇప్పటికీ మూడు సంవత్సరాలవుతుంది.నన్ను ఉద్దేశించి ఇప్పటికీ చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

ఆ విషయం లో మీరు స్పందించడం లేదు కదా.కేవలం ఇంగ్లాండ్ విషయంలోనే మీకు ఇలాంటి ఒపినియన్ ఎందుకు అని స్టోక్స్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

దీప్తి శర్మ రనౌట్ చేయడం పట్ల ఇంగ్లాండ్ మీడియా చేస్తున్న రచ్చను హర్ష భోగ్లే ఖండించిన సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా మన్కడింగ్ రనౌట్ గురించి కామెంట్లొస్తున్నాయి.కేవలం మా ఇంగ్లాండ్ టీం వాళ్లే కామెంట్లు చేయట్లేదు.కానీ మమ్మల్ని ఉద్దేశించే ఇలాంటి ట్వీట్లు చేయడం ఎంతవరకు సబబు.

రనౌట్ గురించి మాట్లాడ్డానికి క్రికెట్ కేవలం ఇంగ్లాండ్ మాత్రమే ఆడట్లేదు కదా అంటూ స్టోక్స్ పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube