పవన్ కళ్యాణ్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా కథతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఎ.

 Ben Lock Work To Pawan Kalyan Movie, Director Krish, Hollywood Visual Effects Di-TeluguStop.com

ఎం రత్నం నిర్మిస్తున్నాడు.ఇక ఇందులో పవన్ కళ్యాణ్ విప్లవ వీరుడుగా కనిపిస్తాడని ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

ఇక విజువల్ వండర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం హాలీవుడ్ విఎఫ్ఎస్ డైరెక్టర్ బెన్ లాక్ పని చేస్తున్నాడు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ద్రువీకరించాడు.పవన్‌ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు క్రిష్‌, పవన్‌ కళ్యాణ్ తో పనిచేయడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.

ఇక హాలీవుడ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ దర్శకుడు ఈ సినిమాకు పనిచేస్తూ ఉండటంతో సినిమా రేంజ్ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది.ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో ఈ సినిమాలో సందడి చేయబోతున్నాడు.

బెన్‌లాక్ ఈ సినిమాకి పని చేస్తున్నాడని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.బెన్ లాక్ కి నెటిజన్లు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతున్నారు.

ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.మొత్తానికి పవన్ కళ్యాణ్ కెరియర్ లో భిన్నమైన ప్రాజెక్ట్ కావడంతో మొదటి సారి పవన్ కళ్యాణ్ ని ఒక పోరాటవీరుడు పాత్రలో చూడటానికి ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube