అగ్రనిర్మాత ఆఫీస్ ని సీజ్ చేసిన బ్యాంకు

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మళ్ళీ వివాదంలో ఇరుకున్నారు.ఈ నిర్మాత నటులకు కాని, దర్శకులకు కాని, మిగితా టెక్నిషియన్స్ కి కాని డబ్బులు టైమ్ కి ఇవ్వరని ఇప్పటికే చాలా సార్లు వార్తలు వినిపించాయి.

 Bellamkonda Suresh’s Office Seized By Bank-TeluguStop.com

నిర్మాతల మండలికి చాలాసార్లు ఆయనపై ఫిర్యాదులు కూడా వెళ్ళాయి.ఇక తాజాగా మరో వివాదం.

ఇప్పుడు ఒక బ్యాంక్ బెల్లంకొండ ఆఫీస్ ను సీజ్ చేసింది.

విషయంలోకి వెళ్తే, తన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన “స్పీడున్నోడు” చిత్రానికి కొంత పెట్టుబడి పెట్టారు బెల్లంకొండ.

దానికోససం కొటాక్ మహింద్ర బ్యాంక్ నుంచి 7 కోట్ల లోన్ తీసుకున్నారు.బ్యాంక్ కి చేయాల్సిన చెల్లింపులు ఎంతకీ చేయకపోవడంతో మొదట నోటీసులు పంపించిన బ్యాంకు , బెల్లంకొండ నుంచి స్పందన కూడా కరువవడంతో ఇక లాభం లేదని ఆయన ఆఫీస్ ని సీజ్ చేసేసింది.

స్పీడున్నోడు చిత్రాన్ని అధిక రేట్లకు అమ్మినా, భారి నష్టాలు రావడంతో పంపిణిదారుల ఒత్తిడిలో కొంతభాగం తిరిగి చెల్లించారేమో, అందుకే ఉన్న అప్పు తీర్చలేకపోతున్నారు అని సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలే ఫ్లాపుల్లో ఉన్న బెల్లంకొండ సురేష్ కి ఇది మరో ఎదురుదెబ్బ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube