మెగాస్టార్ టైటిల్ పై బెల్లంకొండ హీరో ఆసక్తి!

ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాల టైటిల్స్ ని తెలుగు దర్శకులు హీరోలు మళ్ళీ వాడేస్తున్నారు.టైటిల్ లో హీరోయిజం ఉండటంతో తమ కథలకి సరిపోతే ఏ మాత్రం ఆలోచించకుండా పెట్టేసుకుంటున్నారు.

 Bellamkonda Srinivas Using Chiranjeevi Hit Movie Title-TeluguStop.com

ఓ వైపు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ చిరంజీవి హిట్ టైటిల్ అయిన హీరోని ని తన సినిమా కోసం వాడుకుంటున్నాడు.ఇక నేచురల్ స్టార్ నాని విక్రం కుమార్ తో తెరకెక్కించే సినిమా కోసం గ్యాంగ్ లీడర్ టైటిల్ ని వాడుకుంటున్నాడు.

అలాగే మరికొంత మంది కూడా చిరంజీవి గత చిత్రాల టైటిల్స్ ని మళ్ళీ రిజిస్టర్ చేయించారు.

ఇదిలా ఉంటే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త చిత్రం కోసం మెగాస్టార్ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నాడు.

తమిళంలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యిన రాచ్చసన్ సినిమాని తెలుగులో శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరక్కుతుంది.ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా టైటిల్ ని రాక్షసుడు అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.అయితే ఇదే టైటిల్ తో కొంత కాలం క్రితం సూర్య హీరోగా ఓ సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యింది.

మళ్ళీ రాక్షసుడు సినిమా టైటిల్ అంటే తెలుగు ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube