జనవరి 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న బెల్లంకొండ అల్లుడు

కమర్షియల్ కథలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్.మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తన ప్రతి సినిమా కూడా రిచ్ గా ఉండేలా ప్లాన్ చేసుకొని తనని తాను ఎలివేట్ చేసుకుంటున్న బెల్లంకొండ హీరోకి జయజానకీ నాయక రూపంలో ఓ మంచి హిట్ వచ్చింది.

 Bellamkonda Srinivas Movie Release On January 15-TeluguStop.com

ఆ తరువాత సాక్ష్యం సినిమా కూడా పర్వాలేదని టాక్ సొంతం చేసుకుంది.అయితే రాక్షసుడు సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యి కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరల కమర్షియల్ ఎంటర్టైన్ జోనర్ లోకి వచ్చేసి అల్లుడు అదుర్స్ సినిమా చేశాడు.ఈ సినిమా ఫుల్ లెన్త్ కామెడీతో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండనుంది.

 Bellamkonda Srinivas Movie Release On January 15-జనవరి 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న బెల్లంకొండ అల్లుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్, నాభా నటేష్ నటించారు.ఈ ఇద్దరు భామలతో సయ్యాట ఆదుకున్న ఈ హీరో ప్రేక్షకులకి వినోదం పంచాండానికి సంక్రాంతిని ఎంచుకున్నాడు.

ఇప్పటికే సంక్రాంతి బరిలో హీరో రామ్ రెడ్ సినిమాతో రావడానికి రెడీ అయ్యాడు, అలాగే నితిన్ రంగ్ దే సినిమాతో సందడి చేయడానికి షురూ అయ్యాడు.అలాగే తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా సంక్రాంతిని మాస్టర్ రిలీజ్ కోసం ఎంచుకున్నాడు.

ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా సంక్రాంతి అల్లుడుగా మారడానికి రెడీ అయ్యాడు.జనవరి 15న అల్లుడు అదుర్స్ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు.థియేటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి అంటూ పోస్టర్ తో కలిపి పోస్ట్ పెట్టాడు.

మరి తక్కువ ఆక్యుపెన్సీతో ఉన్న థియేటర్స్ లో ఈ సంక్రాంతి కోళ్లు ఎంత వరకు సందడి చేస్తాయనేది చూడాలి.

.

#Alludu Adurs #Nabha Natesh #January

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు